Begin typing your search above and press return to search.
నందమూరి సుహాసినికి సెగ..ముందే నిరసన
By: Tupaki Desk | 16 Nov 2018 1:42 PM GMTమహాకూటమిలో కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ఎంపిక చేసిన నందమూరి సుహాసిని మాకొద్దని - స్థానికేతరులైన అభ్యర్థులను బరిలో దింపితే కాంగ్రెస్ పార్టీ ప్రతాపం చూపిస్తామని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.దివంగత నేత - చంద్రబాబు బావమరిది - టీడీపీ మాజీ ఎంపీ అయిన హరికృష్ణ కుమార్తెకు కుకట్ పల్లి సీటును కేటాయించటం. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె పేరును ఖరారు చేయడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీకంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని సర్వేలలో కాంగ్రెస్ పార్టీకే ప్రజాధరణ ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. కాంగ్రెస్ - టీడీపీ పొత్తులో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయిస్తున్నట్లు అధిష్టానం నాయకులు సమాచారం ఇచ్చినప్పుడు కూకట్ పల్లి కాంగ్రెస్ నేతల అభిప్రాయం మేరకే టీడీపీ అభ్యర్థిని నిర్ణయించాలని కోరడం జరిగిందన్నారు. కానీ...నేడు కూకట్ పల్లి నియోజక వర్గానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు టీడీపీ అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. టీడీపీ పార్టీలో స్థానికంగా బలమైన నాయకుడు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని టీడీపీ నేతలను కోరారు. ఐదేండ్లుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేశామని నేడు నాన్ లోకల్ వ్యక్తులను బరిలోకి దింపితే టీడీపీ గెలుపు కోసం పనిచేసే ప్రసక్తే లేదన్నారు.
గతంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో విజయరామారావు - జయప్రకాశ్ నారాయణ లాంటి బయటి వ్యక్తులు పోటీచేసి గెలుపొందినప్పుడు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో స్థానిక సమస్యలు పరిష్కారం కాకుండా పోయాయని కాంగ్రెస్ నేతలు వాపోయారు. స్థానిక నాయకులకు అవకాశం కల్పిస్తే గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి బలవంతంగా ఇక్కడ ప్రజలపై రుద్దవద్దని అధినాయకులను కోరారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీసీలు - మైనార్టీలు - ఎస్సీలు - కాపు సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారని ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ సీటును కేటాయించడం బాధాకరమన్నారు. టీడీపీ పార్టీ ఒంటెద్దు పోకడలతో కూకట్ పల్లి నియోజకవర్గంలో నాన్ లోకల్ అభ్యర్థిని బరిలోకి దించారని తక్షణమే నిర్ణయం మార్చుకుని స్థానిక నాయకులకు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థిని మార్చని పక్షంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రతాపాన్ని టీడీపీకి చూపిస్తామని హెచ్చరించారు.