Begin typing your search above and press return to search.
పర్యటనకే పరేషాన్.. పోటీ చేస్తే ఫలితం ఎంత? నందమూరి వారసుడిపై చర్చ!
By: Tupaki Desk | 19 Dec 2022 11:30 PM GMTనందమూరి కుటుంబం అంటే..ఏపీ ప్రజలు ప్రాణం పెడతారు. ఈ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా.. ఆదరిస్తారు. రాజకీయాల పరంగా నందమూరి బాలకృష్ణ గత వైసీపీ వేవ్‌లోనూ గెలుపు గుర్రం ఎక్కారు. ఇలాంటి నందమూరి కుటుంబం నుంచి తాజాగా నందమూరి తారక రత్న... ఏపీకి వచ్చారు. వచ్చీ రావడంతోనే ఆయన ఏపీలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించారు.
అయితే.. ఇక్కడ విషయం ఏంటంటే.. ఆయనపర్యటనను టీడీపీ నాయకులు అసలు పట్టించుకోక పోవడమే!. కీలకమైన గుంటూరు జిల్లాలో తారక్ పర్యటిస్తే..భారీ ఎత్తున స్వాగత సత్కారాలు ఉంటాయని ఆశించా రు. కానీ, ఆయనకు ఎవరూ ఎదురేగి స్వాగతం చెప్పలేదు. ఆయన వెంట కనీసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ, నాయకులు కానీ లేకుండానే చప్పగా ఆయన గుంటూరుకు వచ్చారు. వెళ్లారు!
మరి, ఇది ఉద్దేశ పూర్వకంగానే జరిగిందా? లేక.. యాదృచ్ఛికంగా జరిగిందా? అనేది ఆసక్తిగా మారింది. నిజానికి నందమూరి కుటుంబం వస్తే.. పండగ చేసుకునే టీడీపీ నాయకులు తారకరత్న విషయంలో మాత్రం వెనక్కి తగ్గారు. దీనికి కారణాలపై ఇప్పుడు నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఇక, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా తారకరత్న ప్రకటించారు.
అయితే, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదు కానీ, ఆయన పర్యటనకే ప్రాధాన్యం దక్కనప్పు డు.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా.. టీడీపీ నాయకులు జై కొడతారా? అనేది ప్రశ్న. పైగా.. ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నా.. అక్కడ కేడర్.. తమ్ముళ్ల మద్దతు అవసరం.
ఇప్పుడే ఇలా ఉంటే.. ఆయన రేపు ఎన్నికల గోదాలో దిగితే ఏం టి పరిస్థితి అంటున్నారు పరిశీలకులు. చూడాలి మరి చంద్రబాబు ఏం చేస్తారో.. ఏం జరుగుతుందో!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.