Begin typing your search above and press return to search.
నందిగ్రామ్ ఫలితం వెనుక ఏమి జరిగింది ?
By: Tupaki Desk | 4 May 2021 5:30 AM GMTఇపుడీ విషయంపై సర్వత్రా చర్చ పెరిగిపోతోంది. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠరేపింది నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి కారణం ఏమిటంటే నందిగ్రామ్ లో మమతబెనర్జీ-బీజేపీ ప్రముఖనేత సుబేందు అధికారి పోటీచేయటమే. మొదటినుండి ఇద్దరి మధ్య ప్రచారం చాలా హోరాహోరీగా జరిగింది. ఇద్దరిలో ఎవరో ఒకరే గెలిచే అవకాశం ఉన్నా దాని ప్రభావం రెండోవాళ్ళ రాజకీయ జీవితంపై ప్రభావం చూపుతుందన్న ప్రచారంతోనే సర్వత్రా టెన్షన్ పెరిగిపోయింది.
అలాంటి నందిగ్రామ్ లో చివరకు ఓట్ల కౌంటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు మరింత అయోమయంగా మారింది. దానికితోడు మమత చేసిన తాజా వ్యాఖ్యలు అయోమయాన్ని మరింత పెంచేస్తున్నాయి. ఇంతకీ నందిగ్రామ్ లో అసలేం జరిగిందంటే నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్ధి సుబేందు అధికారి 1765 ఓట్లతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రయత్నించారు. అయితే ఇక్కడే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.
దానికిముందు ఏమి జరిగిందంటే నందిగ్రామ్ ఓట్ల లెక్కింపు సందర్భంగా మొదటి ఐదు రౌండ్లు బీజేపీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. తర్వాత ఆరో రౌండునుండి మమత ఆధిక్యత మొదలైంది. ఎనిమిదో రౌండుకు సుబేందు మెజారిటి తగ్గిపోయి మమత సమానమయ్యారు. ఆ తర్వాత నుండి ఒక రౌండులో మమత మరో రౌండులో సుబేందుకు అధిక్యత వస్తోంది, తగ్గిపోతోంది. ఇలా ఐదారు రౌండ్లు అయిన తర్వాత చివరకు మమతదే పైచేయి అయ్యింది. దాంతో 1236 ఓట్లతో మమత గెలిచినట్లు ప్రచారం జరిగింది. రాష్ట్ర గవర్నర్ కూడా మమతకు సుభాకాంక్షలు తెలిపారు.
అయితే మమత గెలిచినట్లు ప్రచారంతో పాటు అప్పటికే అఖండ విజయం సాధించేప్పటికి తృణమూల్ నేతలతో పాటు జనాల్లో కూడా సంబరాలు మొదలైపోయాయి. అయితే కొద్దిసేపటి తర్వాత మమత ఓడిపోయినట్లు మళ్ళీ ప్రచారం మొదలైంది. దాంతో ఏం జరుగుతోందో అర్ధంకాలేదు. నాటకీయ పరిణామాల తర్వాత సుబేందు గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
ఇపుడీ విషయంపైనే మమత మాట్లాడుతు మోసం జరిగిందని ఆరోపిస్తున్నారు. రీ కౌంటింగ్ జరిపించటానికి రిటర్నింగ్ అంగీకరించటం లేదని చేసిన వ్యాఖ్యలతో గందరగోళం మొదలైంది. రీ కౌంటింగ్ జరపాలని తాము డిమాండ్ చేస్తుంటే అదే జరిగితే తనకు ప్రాణభయం ఉందని రిటర్నింగ్ చెప్పినట్లుగా మమత వెల్లడించారు. అందుకనే తాను రీ కౌంటింగ్ విషయంలో కోర్టులో కేసు వేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే మమత వ్యాఖ్యలు చూస్తుంటే దీదీ గెలిచినా ఉద్దేశ్యపూర్వకంగానే ఓడిపోయినట్ల రిటర్నింగ్ అధికారితో ప్రకటన చేయించారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.