Begin typing your search above and press return to search.
నిర్భయ దోషి పట్ల అంతే అభిమానమా నందితా?
By: Tupaki Desk | 15 Feb 2016 4:41 AM GMTసమకాలీన కాలంలో చోటుచేసుకుంటున్న ఉదంతాలు చూసిన తర్వాత కూడా కొందరికి కళ్లు తెరుచుకోకపోవటం కాస్త ఆశ్చర్యకరమే. చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత కూడా మనసు మారకుండా.. సామాజిక కార్యకర్త అన్న ట్యాగ్ వేసుకొని కొందరు ‘ఆదర్శవంతుల్ని’ చూస్తే నోటి వెంట మాట రాకుండా ఉంటుంది. బాలీవుడ్ నటి.. సామాజిక కార్యకర్తగా తనకు తాను చెప్పుకునే నందితాదాస్ వ్యవహరమే చూడండి. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే.. మెంటలెక్కిపోవటం ఖాయం.
బాల నేరస్థుల విషయంలో వయో పరిమితిని కుదింపును మరోసారి ఆలోచించాలని ఆమె అంటోంది. ఒకపక్క మూతి మీద మీసం రాకుండా పిల్ల పిశాచుల్లా మారి.. పైశాచికంగా వ్యవహరిస్తూ ప్రాణాలు తీస్తున్న బాల నేరస్థుల పట్ల నందితకు అంత కన్సర్న్ ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు. క్రూరమైన నేరాలకు పాల్పడే వారి వయసుకు సంబంధించి ఇప్పుడు అనుసరిస్తున్న వయోపరిమితిని తగ్గించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తుంటే... నందిత మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడటం గమనార్హం.
క్రూరమైన నేరాలు చేసిన బాల నేరస్థులకు పెద్దవాళ్లకు విధించే శిక్షలు విధించటంలో కనీస వయస్సును ఎంతవరకు ప్రామాణికంగా తీసుకుంటారో స్పష్టం చేయాలని ఆమె కోరుతున్నారు. ఓపక్క క్రూరమైన నేరాలు అని అంటూనే.. మరోవైపు కనీస వయస్సును నిర్ణయించాలని కోరటం ఏమిటన్నది ఒక ప్రశ్న. వయసు ఎంతైనా కానీ.. అవగాహనతో.. తాను చేసేది క్రూరమైన.. దుర్మార్గమైన పని అన్న విషయమని తేలిన తర్వాత ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ.. చిన్న వయసులో దారుణమైన నేరాలు చేసినా ఫర్లేదన్న రీతిలో మాట్లాడటమే అభ్యంతరకరం. ఒక్కసారి నిర్భయ లాంటి ఉదంతం.. ఆ సమయంలో ఆ బాధితురాలు ఎంతటి మానసిక.. శారీరక వేదనకు గురైందన్న విషయాన్ని ఆలోచిస్తే నందిత ఇలా మాట్లాడరేమో..?