Begin typing your search above and press return to search.
నంద్యాల ఉప ఎన్నిక డేట్ వచ్చేసింది
By: Tupaki Desk | 27 July 2017 9:19 AM GMTఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. కొద్ది రోజులుగా ఏపీ రాష్ట్ర రాజకీయాన్ని హీటెక్కిస్తున్న కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. ఏపీ అధికార.. విపక్షాలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన భూమా నాగిరెడ్డి తర్వాతి కాలంలో ఏపీ అధికారపక్షంలోకి జంప్ కావటం.. అనారోగ్యంతో ఆయన మరణించటంతో తాజా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికను ఏపీ అధికార.. విపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే ఇదో హాట్ టాపిక్ గా మారింది.
అన్నింటికి మించి ఈ ఉప ఎన్నిక కోసం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు.. అధికారపక్షానికి చెందిన మంత్రులంతా నంద్యాల్లో మకాం వేయటం.. నంద్యాల ఎన్నికల్లో విజయం కోసం ప్రత్యేకించి వరాల మీద వరాలు ఇవ్వటం పలు విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉంటే.. ఎన్నికల సంఘం నంద్యాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. అధికారపక్షం తరఫున భూమా బ్రహ్మానంద రెడ్డి బరిలోకి దిగుతుండగా.. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేయనున్నారు.
నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ చూస్తే..
నోటిఫికేషన్ జారీ: జూలై 29
నామినేషన్ దాఖలు చివరి తేదీ : ఆగస్టు 5
నామినేషన్ల విరమణకు చివరి తేదీ: ఆగస్టు 9
పోలింగ్ : ఆగస్టు 23
ఫలితాల విడుదల: ఆగస్టు 28