Begin typing your search above and press return to search.
నంది విజేత?: అనూహ్యంగా మారిన పోస్టల్ బ్యాలెట్
By: Tupaki Desk | 28 Aug 2017 2:15 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితం మరికాసేపట్లో వెలువడనుంది. ముందుగా నిర్ణయించిన ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఓట్ల లెక్కింపులో భాగంగా మొదటగా లెక్కించే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
మొత్తం 250 పోస్టల్ ఓట్లకు సంబంధించి మూడు ఓట్లు తిరిగి రాగా.. 211 ఓట్లు తిరిగి రాలేదని చెబుతున్నారు. తిరిగి వచ్చిన 39 చెల్లనివిగా గుర్తించటంతో మొత్తం 250 ఓట్లు ఎలాంటి ఫలితం లేకుండా మారాయి. పోటాపోటీగా సాగుతున్న అధికార.. విపక్షాల మధ్య నడుస్తున్న నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకంగా అభివర్ణిస్తున్న వేళ.. 250 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఎలాంటి ఫలితం లేకుండా మారటం ఆసక్తికరంగా మారింది.