Begin typing your search above and press return to search.
వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర?
By: Tupaki Desk | 7 Aug 2021 5:08 AM GMTఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు తమ ప్రభుత్వం మీద ఈగ వాలనీయకుండా చూసుకుంటారు. చిన్న విమర్శ వచ్చినా వెంటనే స్పందించి సమాధానం ఇస్తారు. సమాధానం ఎలా ఉన్నా స్పందన మాత్రం తొందరగానే ఉంటుంది. ఇటీవల పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు విరిగిపోవడంపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ గేటు విరిగిపోవడం వల్ల ప్రాజెక్టులోనీ నీరు చాల వరకు వృథా అయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రతిపక్షాలు ప్రాజెక్టులోని నాణ్యతా లోపాన్ని ఎత్తిచూపుతూ ఆరోపిస్తున్నారు. అయితే ఇందుకు కారణం ఎవరన్నది పక్కనబెడితే.. అటు ప్రభుత్వం సైతం దీనికి బాధ్యులైన వారిని విడిచిపెట్టేది లేదని హెచ్చిరిస్తోంది. ఈ క్రమంలో మంత్రి పేర్ని నాని బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ ముఖ్యమంతి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు విషయాలపై చర్చించారు. కేబినేట్ సమావేశ ప్రధాన అంశాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిపోవడానికి బాధ్యులైన వారిని విడిచిపెట్టేది లేదన్నారు. అలాగే పులిచింతల ప్రాజెక్టు నీరు పోవడం ద్వారా రైతులు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఎగువ నుంచి వచ్చే నీటితో ఈ ప్రాజెక్టు నిండుతుందన్నారు. ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా భయపెడుతున్నారన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షలు చెల్లిస్తామని ప్రకటించారు. దీనిపై కేబినేట్ ఆమోద ముద్ర వేసిందన్నారు.
ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాలకు సందర్శించాలని నిర్ణయించామన్నారు. నెలకు కనీసం 12 రోజుల పాటు సచివాలయాలకు సందర్శన చేయాలని వెల్లడించారు. ప్రజలతో మమేకమైన వారి సమస్యలపై స్పందించాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని ప్రజలతో కలిసుండి వారి సమస్యలపై స్పందించాలని నిర్ణయించామన్నారు.
భూముల క్రమబద్ధీకరణక కేబినేట్ ఆమోదం తెలిపిందన్నారు. అయితే అభ్యంతరం లేని భూములను మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. ఆయా భూముల్లో సర్వేలు నిర్వహించి అవసరానికి ఉపయోగిస్తామన్నారు. ఇప్పటికే చాలా మంది పేదలకు ఇండ్లు అందిచామని, అవసరమైన వారికి భూమిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ఈ ప్రక్రియ న్యాయపరంగానే సాగుతుందన్నారు. ఎలాంటి అవకతవకలకు చోటు చేసుకోకుండా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యారంగంపై జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పేద విద్యార్థులు చదువుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు. విద్యార్థుల అభివృద్ధితో పాటు పాఠశాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 34వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధఇ చేశామన్నారు. అలాగే తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా చేశామన్నారు. నూతన విద్యావిధానంలో పాఠశాలలను 6 రకాలుగా వర్గీకరించామన్నారు. ఇక అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలో నగదు పంపిణీ చేస్తామన్నారు.
ప్రజా సంక్షేమం కోసమే జగన్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అయినా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానడం లేదన్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు సరైనవి కావన్నారు. రాష్ట్రంలో బీజేపీకి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నారన్నారు. అందుకు ప్రభుత్వాన్నికూల్చేందుకు కుట్రపన్నారన్నారు. గతంలో మోడీని తిట్టిపోసిన టీడీపీ నేత చంద్రబాబు ఇప్పుడు ఆయనకు ప్రేమలేఖలు రాస్తున్నారన్నారు. టీడీపీ, బీజేపీలు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా చెల్లవన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వమే మరోసారి వస్తుందన్నారు. ప్రజలకు జగన్ ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందన్నారు. సొంత ప్రయోజనాల కోసం బీజేపీ ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం పై ప్రజల విశ్వాసం ఉంటున్నారు.