Begin typing your search above and press return to search.
చంద్రబాబు-లోకేష్ పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
By: Tupaki Desk | 13 April 2021 6:30 AM GMTతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడుతోపాటు అతని కుమారుడు లోకేష్ కోవిడ్ వ్యాక్సిన్‌ను రహస్యంగా తీసుకున్నారని మంత్రి పెర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే టీకా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ఆ ఫొటోలను ప్రజలతో పంచుకున్నారని.. చంద్రబాబు-లోకేష్ ద్వయం ఎందుకు టీకా తీసుకొని మరీ ఇలా దాచేశారని పేర్ని నాని ప్రశ్నించారు.
వీరిద్దరూ టీకాను రహస్యంగా తీసుకున్నారని.. వీరిద్దరి వల్ల పార్టీ ఎమ్మెల్యేలకు చాలా మందికి కోవిడ్ వ్యాప్తించిందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు..టిడిపి ఎమ్మెల్యేల్లో చాలా మంది హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారని తెలిపారు.
ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం ఆలోచించకుండా తిరుపతి ఉప ఎన్నికలల్లో చంద్రబాబు-లోకేష్ ప్రచారం చేయడం ద్వారా కోవిడ్‌ను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో ప్రచారం చేయకుండా, కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి మాత్రమే సభను క్యాన్సిల్ చేశారని.. తన సమావేశానికి లక్షలాది మంది హాజరవుతారని, భౌతిక దూర ప్రోటోకాల్ అటువంటి సందర్భాల్లో కష్టం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజలు వ్యాధి బారిన పడకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఎన్నికల కంటే తనకు ప్రజలే ముఖ్యం అని చాటిచెప్పారన్నారు.
"జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ఆలోచిస్తారు. రాజకీయంగా ఓడిపోయినప్పటికీ తిరుపతిలో ప్రచారం కోసం తాను అడుగు పెట్టను" అని జగన్ తీసుకున్న నిర్ణయంపై పేర్ని నాని పొగడ్తల వర్షం కురిపించారు.