Begin typing your search above and press return to search.
రాజకుమారి కష్టానికి ఫలితం దక్కింది
By: Tupaki Desk | 28 Jan 2016 5:01 AM GMTతెలుగు రాజకీయాల్లో అదృష్టం కంటే దురదృష్టం ఎక్కువగా వెంటాడే మహిళా నేతల్లో నన్నపనేని రాజకుమారి ఒకరని ఫీలవుతుంటారు. ఎమ్మెల్సీలో తన పేరు కోసం ఆమె ఎంతగా తపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఫైర్ బ్రాండ్ మాదిరి రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే ఆమె.. గతంలో ఓ రేంజ్ లో చెలరేగిపోయేవారు. ఇప్పుడు కాస్త మాట జోరు తగ్గింది కానీ.. గతంలో ఆమె హడావుడే వేరుగా ఉండేది.
పదేళ్లు పార్టీ విపక్షంలో ఉండటం నన్నపనేనికి శాపంగా మారింది. పదవి కోసం.. పార్టీలో గుర్తింపు కోసం ఆమె చాలానే కష్టపడ్డారు. ఆమె కష్టానికి తాజాగా ఫలితం దక్కిన పరిస్థితి. తాజాగా ఆమెను ఆంధ్రప్రదేవ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీగా ఆమె పదవి కాలం ముగిసిన తర్వాత ఖాళీగానే ఉంటున్నారు.
తాజాగా ఆమెను మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా ఎంపిక చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐదేళ్లు పాటు ఈ పదవిలో ఉండనున్నారు. 1998 చట్టం తొమ్మిదో నిబంధన ప్రకారం ఈ కమీషన్ ను ఏర్పాటు చేశారు. ఇక.. కమిషన్ లోని ఐదుగురు సభ్యుల్ని త్వరలో నియమించనున్నారు. ఎట్టకేలకు నన్నపనేనికి ఒక పదవి దక్కటం చూస్తే.. ఇంతకాలం పార్టీలో ఆమె పడిన కష్టానికి ఫలితం లభించినట్లేనని చెప్పక తప్పదు.