Begin typing your search above and press return to search.
వేధింపుల్లో నన్నపనేనికి కొత్త కోణం కనబడింది!
By: Tupaki Desk | 23 March 2017 9:24 AM GMTవైవాహిక బంధంలో అడుగు పెట్టిన మహిళలకు వేధింపులు నిత్యకృత్యమయ్యాయని మనమంతా గగ్గోలు పెడుతున్నాం. మహిళలను ఈ వేధింపుల బారి నుంచి తప్పించేందుకు ఏకంగా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాం. అంతేనా గృహ హింస చట్టం పేరిట కొత్తగా వచ్చిన చట్టంతో భార్యలను వేధించాలంటేనే పురుషులు భయపడిపోతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా పురుషుల్లో మార్పు రావడం లేదని వాపోతున్న మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో మహిళలను వేధింపుల నుంచి కాపాడేందుకు అటు కేంద్రంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేకంగా మహిళా కమిషన్లను ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిషన్లకు మహిళలే చైర్ పర్సన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలో ఏర్పాటైన మహిళా కమిషన్ కు టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. తనదైన శైలి కామెంట్లతో వేధింపురాయుళ్లపై విరుచుకుపడే మనస్తత్వమున్న నన్నపనేనికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడిందట.
ఇప్పటిదాకా మనకు మహిళలపై వేధింపుల మాటే తెలియగా... కొత్తగా భార్యల నుంచి కూడా తమకు వేధింపులు ఎదురవుతున్నాయని మొరపెట్టుకుంటున్న పురుషులు ఏకంగా నన్నపనేని కార్యాలయానికి క్యూ కడుతున్నారట. భార్యా బాధితుల సంఘం పేరిట అప్పుడెప్పుడో ఓ కొత్త సంఘం వెలుగులోకి రాగా... భార్యల చేతిలో నిత్యం వేధింపులకు గురవుతున్న భర్తలంతా ఆ సంఘంలో చేరిపోయారు. అయితే ఆ తర్వాత ఆ సంఘం పెద్దగా కనిపించిన దాఖలా లేదు. అయితే ఆ సంఘం మాట మరుగున పడిపోయినా... భార్యల వేధింపులతో ఇప్పటికీ నిత్యం నరకం అనుభవిస్తున్న భర్తలు మాత్రం తమ వేదనను బయటపెట్టేందుకు బయలుదేరినట్టే ఉన్నారు. ఏపీలోని ఈ తరహా భర్తలంతా ఇప్పుడు నన్నపనేని కార్యాలయం ముందు వాలుతున్నారట. ఎలాగో తెలుసా?... వీడియో సాక్ష్యాలు చేతుల్లో పట్టుకుని మరీ వారు నన్నపనేనిని శరణు వేడుతున్నారట.
మృగాళ్లుగా మారుతున్న మగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకంటూ ఏర్పాటైన కమిషన్ ముందు... మహిళల వేధింపుల నుంచి తమను కాపాడండంటూ మగాళ్లు వచ్చి నిలబడుతున్న తీరు కాస్తంత ఆసక్తిగానే ఉంది. ఇదేదో వేరే ఎవరో చెప్పిన విషయం ఎంతమాత్రం కాదు. స్వయానా మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో ఉన్న నన్నపనేని రాజకుమారి చెప్పిన మాట. వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనానికి వచ్చిన ఆమె... మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. మహిళా కమిషన్‌కు అందుతున్న కేసుల్లో 25శాతం మహిళా బాధితులైన పురుషుల నుంచి వస్తున్నవేనని ఆమె చెప్పుకొచ్చారు. తమను తమ భార్యలు కొడుతున్నారంటూ ఆ బాధిత మగాళ్లంతా సాక్ష్యాలుగా వీడియోలు కూడా చూపిస్తున్నారని నన్నపనేని చెప్పారు. మరి ఈ సాక్ష్యాలతో కూడిన వేధింపులపై నన్నపనేని ఎలా స్పందిస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/