Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని స‌హాయం కోసం టీడీపీ నేత !

By:  Tupaki Desk   |   14 Jun 2018 3:31 PM GMT
ప్ర‌ధాని స‌హాయం కోసం టీడీపీ నేత !
X
పురుషుల కోసం క‌మిష‌న్ ఏర్పాటుచేయాలంటూ సంచ‌ల‌న డిమాండ్ చేసిన మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ ప‌ర్స‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమార్ ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. ఇటీవల కాలంలో భార్యల చేతిలో చనిపోతున్న - చిత్రహింసలకు గురవుతున్న మగాళ్ల రక్షణకు ఓ కమిషన్ ఉండాలని న‌న్న‌ప‌నేని కోరారు. కాగా, ఉత్తరాంధ్రలో నెల రోజుల వ్యవధిలోనే రెండు ఘోరాలు జరిగిన సంగ‌తి తెలిసిందే. పెళ్లయిన వారం రోజుల్లోనే తన భర్తను సుపారీ ఇచ్చి ఓ భార్య చంపించింది. మరో కేసులో పెళ్లయిన 20 రోజుల్లోనే.. బైక్ పై వెళుతూనే భర్తను వెనక నుంచి కత్తితో పొడిచి అక్కడి నుంచి అతని భార్య పరారీ అయింది. అదే విధంగా వివాహేతర సంబంధాలతో భర్తలపై హత్యాయత్నాలు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌న్న‌ప‌నేని స్పందిస్తూ శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామన్నారు.మహిళల్లో ఇలాంటి విపరీతమైన నేర ప్రవృత్తి పెరగటానికి టీవీల్లో వచ్చే సీరియల్స్ కారణం అని అన్నారు. సీరియల్స్ కు సెన్సార్ ఉండాలని.. నేర ఇతివృత్తం - కుట్ర - కుతంత్రాలు ఉండే సీన్స్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. మహిళల్లో ఇలాంటి విపరీత ధోరణిలకు కారణాలను గుర్తించి.. వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా.. భార్యలో చేతిలో మోసపోతున్న - చిత్రహింసలకు గురవుతున్న మగాళ్లకు.. ఓ కమిషన్ ఉండాలన్నారు. మహిళా కమిషన్ ఉన్నట్లే.. పురుషుల కమిషన్ ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించారు.

మ‌రోవైపు నన్నపనేని వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్‌ లో మహిళా ఐక్యకార్యాచరణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగిన సందర్భంగా ఈ డిమాండ్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. నన్నపనేని వ్యాఖ్యలు విచారకరమన్నారు. పదవికి రాజీనామా చేసి అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి ఉండేదన్నారు. చైర్‌ పర్సన్‌ పదవికి ఆమె అనర్హురాలిగా ప్రకటిస్తున్నామని, ఆమె వివరణ లేకుండా ఏపీ ప్రభుత్వం ఆమెను పదవి నుండి దించేయాలని డిమాండ్‌ చేశారు. ఇలా ఈ వివాదం ఇలా కొన‌సాగుతుండ‌గానే...గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మ‌ళ్లీ అదే త‌ర‌మా కామెంట్లు చేశారు. హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండే టీవీ సీరియల్స్ పై సెన్సార్ విధించాలంటూ కోర్టుకు వెళ్తానని నన్నపనేని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఇదే విషయంపై ప్రధానికి - కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానన్నారు. సోషల్ మీడియాల్లో అశ్లీల దృశ్యాలను నిరోధించడానికి కృషిచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మ‌ద్య‌పానం విష‌యంలో కూడా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని న‌న్న‌ప‌నేని కోరారు.