Begin typing your search above and press return to search.
కవిత బతుకమ్మకు, ఓదార్పు యాత్రకు లింక్!!
By: Tupaki Desk | 23 Oct 2016 3:58 AM GMTబతుకమ్మ సంబరాలు పేరుతో దేశ విదేశాల్లో పూల పండుగ గురించి నిర్వహించిన టీఆర్ ఎస్ ఎంపీ - సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి సైటైర్లు వేశారు. పేరు బతుకమ్మది అయితే...బ్రాండింగ్ కవితమ్మదని ఎద్దేవా చేశారు. అక్రమ సంపాదన దాచడానికే బతుకమ్మ పేరుతో విదేశాలకు వెళ్లిందని విమర్శించారు. బతుకమ్మ పేరును కొద్దిరోజులకు కవితమ్మగా మార్చిన ఆశ్చర్య లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర- కవిత బతుకమ్మ యాత్ర పూర్తయ్యేది కాదని నన్నూరి నర్సిరెడ్డి ఎద్దేవా చేశారు.
బతుకమ్మ కీర్తి దునియా మొత్తం చాటామంటున్న కవిత మాటలు విడూరంగా ఉన్నాయని నన్నూరి నర్సిరెడ్డి ఎద్దేవా చేశారు. బతుకమ్మ పండుగనే బతుకు తెరువుగా మార్చుకున్న కవితమ్మ పేరు బతుకమ్మది బ్రాండింగ్ కవితమ్మది అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ బతుకమ్మను అంతర్జాతీయ బతుకమ్మ చేశానన్న కవిత తన తండ్రి సహకరించి ప్రభుత్వ సొమ్మును దారదత్తం చేస్తే అంతరిక్షంలో ఆడడానికి కూడా సిద్ధంగా ఉందని విమర్శించారు. వారి కీర్తి ప్రతిష్టల కోసం బతుకమ్మకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంచి కేసీఆర్ ఏకంగా అర్నం కింద బతుకమ్మ పండుగనే జాగృతి సంస్థకు ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారని ఆరోపించారు. 10 కోట్లు ఇస్తే రాష్ట్రంలో ఆడిన ఎంపీ కవిత...15 కోట్లు ఇస్తే విదేశాల్లో బతుకమ్మ ఆడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ ఇస్తే ఏకంగా అంతరిక్షంలో ఆడుతారని విమర్శించారు. మహిళలు ఆడాల్సిన బతుకమ్మను మంత్రులను సైతం ఆడించిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని ఆయన వ్యాఖ్యానించారు. బతుకమ్మ పేరును కవితమ్మగా మార్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో సదుల బతుకమ్మతో బతుకమ్మ పండుగ పూర్తయితే - కవితమ్మ బతుకమ్మ జగన్ ఓదార్పు యాత్రలాగా సాగుతోందని నర్సిరెడ్డి సెటైర్ వేశారు. ప్రకటించే అంతా ఆస్తులు తమకు లేవని చెప్పిన ఎంపీ కవిత ఉద్యమాన్ని అడ్డంపెట్టుకొని పేపర్లు - టీవీ ఛానళ్ళు తన కుటుంబానికి ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సెంటిమెంట్ ముసుగులో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎంత చేసినా మీ ఆస్తులు దినదిన ప్రవర్థనమానమై పెరిగిన విషయం అందరికీ తెలిసిందేనని నర్సిరెడ్డి విమర్శించారు. కుటుంబ అంతా వసూళ్ల రాజాలని నర్సిరెడ్డి ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/