Begin typing your search above and press return to search.
కేసీఆర్ సర్కారులో సామాన్యుడికి ఇంత షాకా?
By: Tupaki Desk | 30 Sep 2017 5:11 AM GMTఎవరి కారణంగా ఇబ్బంది ఎదురైతే ఏం చేస్తాం? బుద్ధిగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేస్తాం. మరి.. అలా చేసే వారిపైనే నేరం ఆరోపించి జైలుకు పంపించే ఉదంతాన్ని మీరు విన్నారా? మరీ.. అంత దారుణమైన పరిస్థితి ఎక్కడ ఉందో తెలిస్తే ఉలిక్కి పడటమే కాదు.. అవాక్కు కావటం ఖాయం.
ఫిర్యాదు చేయటమే పాపంగా మారిన వైనం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న మెట్రో పనులపై ఈ ఆగస్టులో ఒక సగటు జీవి చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారు. అంతే.. ప్రభుత్వ అధికారులపై దాడి చేశారంటూ సెక్షన్ 332 కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించిన విషయాన్ని మీడియాతో పంచుకున్నారు ఓల్డ్ మలక్ పేట నివాసి నఖ్వీ.
మామూలుగా అయితే ఇలాంటి మాటల్ని నమ్మే విషయంలో కాస్త డౌట్ ఉంటుంది.కానీ.. నఖ్వీ చెప్పిన మాటలు ఎవరి ముందో తెలుసా? ఏకంగా తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ ఇతర ఉన్నతాధికారుల ముందు. జైళ్లల్లో పారదర్శకత పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తామెంత ఓపెన్ గా ఉన్నామన్న విషయాన్ని వివరిస్తూ.. అందుకు ఉదాహరణగా నఖ్వీని చూపించారు. ఈ సందర్భంగా బాధితుడు చెప్పిన మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.
అంతేకాదు.. విచారణ ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన ఖైదీలను ఎంత దారుణంగా చూస్తున్నారన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. మెట్రో పనులపై కంప్లైంట్ చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనపై రివర్స్ లో కేసు పెట్టి జైలుకు పంపటంతో తాను 24 రోజులు చంచల్ గూడ జైల్లో ఉన్నట్లుగా చెప్పారు.
ఈ సెప్టెంబరు 15న బెయిల్ మీద బయటకు వచ్చానన్నారు. విచారణలో ఉన్న ఖైదీలను దుస్తులు ఊడదీసి జైల్లో అవమానిస్తున్నారని.. విచారణ ఖైదీలకు ఉండే హక్కుల గురించి పట్టించుకునే నాథుడే లేడన్నారు. అందుకు తాను తెలుగు.. ఇంగ్లిషు.. హిందీలలో ఖైదీల హక్కుల గురించి అందరికి అర్థమయ్యేలా కరపత్రాల్ని సిద్ధం చేస్తానన్నాడు. ఈ నేపథ్యంలో స్పందించిన జైలుశాఖ అధికారులు విచారణ ఖైదీలతో మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలన్న విషయాన్ని ఇప్పటికే జైలు సిబ్బందికి చెప్పినట్లుగా చెప్పారు. మీడియా సమావేశం సంగతి తర్వాత.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయన్న విషయం తాజా ప్రెస్ మీట్ లో బయటకు వచ్చిందని చెప్పక తప్పదు. పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గొంతు విప్పి ప్రశ్నించటం ఇంత తప్పా కేసీఆర్‌జీ?