Begin typing your search above and press return to search.
పాలిటిక్స్ లోకి భువనేశ్వరి ఎంట్రీ ?
By: Tupaki Desk | 26 Nov 2021 4:30 PM GMTఆమె ఎన్టీయార్ కుమార్తెగానే లోకానికి తెలుసు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు సతీమణిగా, లోకేష్ తల్లిగా కూడా జనాలకు పరిచయం. అలాంటి భువనేశ్వరి ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఆమెను వైసీపీ నేతలు అనుచితంగా విమర్శించారు అంటూ గత వారం రోజులుగా టీడీపీ అగ్గి రాజేస్తోంది. చంద్రబాబు అయితే తన భార్యను ఏపీ అసెంబ్లీలో అవమానించారు అని వెళ్ళిన ప్రతీ చోటా చెబుతున్నారు.
అప్పట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి మరీ కళ్ల నీరు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఏపీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఒక విధంగా ఈ రోజుకీ దీనికి వైసీపీ సరైన జవాబు చెప్పలేక డిఫెన్స్ లో పడిపోయింది.
చంద్రబాబు కుటుంబ సభ్యులను తామేమీ అనలేదని మంత్రి పేర్ని నాని, కొడాలి నాని లాంటి వారు ఒకటికి పది మార్లు చెబుతున్నా కూడా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియచేస్తోంది. ఈ వివాదం ఇక్కడితో ఆగదు అని కూడా అంతా భావిస్తున్నారు. చంద్రబాబు దీనిని జనంలోనే పెట్టి వారి తీర్పు కోరనున్నారని తెలుస్తోంది.
మరి దీనికి విరుగుడు మంత్రం వైసీపీ నేతల వద్ద ఉందో లేదో ఎవరికీ తెలియదు కానీ టీడీపీ మాత్రం ఇది తమ పార్టీ అధినాయకుడికి జరిగిన తీరని అవమానం, మహిళ జాతికే కళంకం అంటూ చెబుతోంది.
దీంతో ఇది అంతకంతకు వేడి రాజుకుంటూనే ఉంది. ఈ నేపధ్యంలో సడెన్ గా భువనేశ్వరి ఎంటీ ఇచ్చారు. ఆమె ఒక బహిరంగ లేఖ ప్రజలకు రాస్తూ తనను అసెంబ్లీలో అవమానించారు అంటూ మండిపడ్డారు. ఇది అన్యాయం అంటూ ఆమె విమర్శించారు.
మొత్తానికి భువనేశ్వరి లేఖ రాయడం అంటే ఈ వివాదం మరో మలుపు తిరిగినట్లుగానే భావిందారు. ఆమె చంద్రబాబు భార్య మాత్రమే కాదు ఎన్టీయార్ కుమార్తె. దాంతో ఇప్పటిదాక చంద్రబాబు చెప్పినదానికన్నా భువనేశ్వరి లేఖకు ఎక్కువ విలువ ఉంటుంది అని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే భువనేశ్వరి కూడా ఇక మీదట పొలిటికల్ గా యాక్టివ్ అవుతారు అంటున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆమె రంగంలోకి దిగి ప్రచారం చేస్తారు అన్న మాట వినవస్తోంది. ఒక బాధిత మహిళగా ఆమె ఏపీ ప్రజానీకానికి ఇపుడు లేఖ ద్వారా తన బాధను అప్పీల్ చేశారు.
ఇక మీదట ఆమె జనంలోకి వచ్చి వైసీపీ సర్కార్ మహిళల మీద చేస్తున్న వేధింపులను ఏకరువు పెడితే ఆ రచ్చ వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీయార్ ఫ్యామిలీ నుంచి బాలయ్య, పురంధేశ్వరి రాజకీయాల్లో ఉన్నారు. ఇపుడు భూవనేశ్వరి కూడా రంగంలోకి దిగితే అది టీడీపీకి మరింత ప్లస్ పాయింట్ అవుతుంది అంటున్నారు.
భువనేశ్వరి కేవలం గృహిణి మాత్రమే కాదు, ఆమె హెరిటేజ్ వంటి అతి పెద్ద సంస్థను నిర్వహిస్తున్న మహిళా ఎంటర్ ప్యూనర్ గా ఉన్నారు. అందువల్ల ఆమె కనుక పాలిటిక్స్ లోకి వస్తే టీడీపీ లో కొత్త హుషార్ రావడం ఖాయం. వస్తాడో రాడో తెలియని జూనియర్ కంటే భువనేశ్వరి ఎంట్రీయే సైకిల్ పార్టీకి బాగా లాభిస్తుంది అంటున్నారు.
వైఎస్సార్ సతీమణి విజయమ్మ జగన్ తరఫున ఎన్నికల ప్రచారం చేసి తన సత్తా చాటారు. ఇపుడు భవనేశ్వరి కూడా రంగంలోకి దిగితే 2024 ఎన్నికల్లో ఆ జోరే వేరుగా ఉంటుంది అంటున్నారు. మొత్తాంకి భువనేశ్వరి ఎంట్రీ తధ్యమనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.