Begin typing your search above and press return to search.
మనమడి మీద నానమ్మకు ఎన్ని ఆశలు
By: Tupaki Desk | 24 Oct 2015 6:21 AM GMTఅసలు కన్నా కొసరు మీద ముద్దు ఎక్కువంటారు. తన కుమారుడు లోకేశ్ గురించి ఆసక్తికరవ్యాఖ్య చేసింది ఒక్కటంటే ఒక్కటి కూడా అమ్మ భువనేశ్వరి చేసినట్లు కనిపించదు. చంద్రబాబు సతీమణిగా ఆమె.. ఎప్పుడూ మీడియాకు దూరంగానే ఉంటారు. అంటీ ముట్టనట్లగా ఉండటంతో పాటు.. ఇంటి వ్యవహారాలు చూసుకోవటంలో తప్పించి మరే విధంగానూ ఆమె పెద్దగా బయటకు రారు. ఎన్నికల సమయాల్లో తప్పించి రాజకీయ పరమైన అంశాల వైపు దృష్టి సారించరు. అలాంటి భువనేశ్వరి మనమడి మీద తన అభిమానాన్ని దాచుకోకుండానే ప్రదర్శించారు.
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కోడలు.. మనమడితో సహా హాజరైన భువనేశ్వరి..పిల్లాడ్ని ఆడిస్తూ.. ముద్దు చేస్తూ కనిపించారు. భువనేశ్వరి.. బ్రాహ్మిణి.. ఉన్న దగ్గరకు వచ్చిన తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి వారిని పలుకరిస్తూ.. తన మెడలో ఉన్న అమరావతి కండువాను చిన్నారి దేవాన్ష్ మెడలో వేశారు.
దీనికి స్పందించిన భువనేశ్వరి.. అమరావతి కండువా వేశారు.. మరి పసుపు కండువా ఎప్పుడు వేస్తారంటూ సరదాగా ప్రశ్నించారు. దీనికి తడుముకోకుండా బదులిచ్చిన రేవంత్ రెడ్డి.. ‘‘అమరావతి భవిష్యత్తు కాబట్టి.. భవిష్యత్తు అమరావతిని పరిపాలించటానికి ఈ కండువా వేశా. పసుపు కండువా ఆయన తాతగారు వేస్తారండి’’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు. పొత్తిళ్లలో ఉన్న బుజ్జాయి భవిష్యత్తుకు సంబంధించి భువనేశ్వరమ్మలో ఉన్న ఆశలు చాలానే ఉన్నట్లుగా ఉంది కదూ.