Begin typing your search above and press return to search.
బ్రాహ్మణికి లోకేశ్ ఇచ్చిన అతి పెద్ద సర్ ప్రైజ్ అదేనట!
By: Tupaki Desk | 26 March 2017 6:20 AM GMTరాజకీయంగా లోకేశ్ సుపరిచితులే కానీ.. వ్యక్తిగత విషయాలు పెద్దగా బయటకు రావు. మిగిలిన సెలబ్రిటీల గురించి మీడియాలో చాలానే ముచ్చట్లు వచ్చినా.. లోకేశ్ కు సంబంధించిన విషయాలు పెద్దగా బయటకు రాలేదనే చెప్పాలి. మీడియాతో ఫ్రెండ్లీగా ఉన్నా.. ఆయన్ను పర్సనల్ గా టచ్ చేస్తూ ఇంటర్వ్యూలు పెద్దగా రాలేదనే చెప్పాలి. అందుకు భిన్నంగా లోకేశ్ సతీమణి.. బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె లోకేశ్ కు సంబంధించిన ఓ సరదా విషయాన్ని వెల్లడించారు.
‘‘లోకేశ్ తో పెళ్లి తర్వాత మా నాన్న బాలకృష్ణ తరచూ ఒక మాట అంటూ ఉండేవారు. నా ఇల్లు.. నా ఇల్లూ అని నా కూతుర్నే కొట్టేశావు కదా అని. అలా ఎందుకన్నారంటే.. ఇప్పుడు హైదరాబాద్ లో మేం ఉండే ఇంట్లో ఒకప్పుడు లోకేశ్.. మామయ్య (చంద్రబాబు).. అత్తయ్యలు ఉండేవారు. మేం హైదరాబాద్ వచ్చేశాక.. మేం మా ఇంటికి వెళితే.. మామయ్య వాళ్లు వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. చిన్నప్పుడు లోకేశ్ ఇంటికి వచ్చినప్పుడల్లా.. ఇది మా ఇల్లు అంటుండే వాడు. నేను కూడా ఇది మా ఇల్లు అనేదాన్ని. ఇలా ఇద్దరం వాదులాడుకునే వాళ్లం’’ అని చెప్పారు.
చిన్నప్పుడు అలా జరిగి.. పెద్దయ్యాక తనను పెళ్లి చేసుకోవటంతో.. నా ఇల్లు.. నా ఇల్లు అంటూ లోకేశ్.. చివరకు ఆ ఇంటికి(బాలకృష్ణ ఇంటికి) అల్లుడైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. బాలయ్య.. ‘‘నా ఇల్లు.. నా ఇల్లు అంటూ నా కూతుర్నే కొట్టేశావుగా’’అని సరదాగా వ్యాఖ్యానించే వారని బ్రాహ్మణి చెప్పారు. అంతేకాదు.. తాను తన తల్లి గర్భంలోఉన్నప్పుడు.. లోకేశ్ ఎప్పుడు.. పాప ఎక్కడుంది? నాకుచూపించు.. నేను ఇప్పుడే చూడాలని మా అమ్మ దగ్గరకు వచ్చి అడిగే వారని.. గొడవ చేసేవారన్నారు. అది జరిగిన పందొమ్మిదేళ్లకే తామిద్దరం భార్యభర్తలయ్యామని బ్రాహ్మణి మురిపెంగా చెప్పటం కనిపిస్తుంది.
లోకేశ్ తో పెళ్లి టైంలో తాను మొదట కాస్త కంగారు పడ్డానని.. కానీ.. కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత.. ఇద్దరి ఆలోచనలు.. అభిరుచులు ఒక్కటేనని అర్థమైనట్లుగా ఆమె చెప్పారు. తన వైవాహికజీవితంలో లోకేశ్ తనకిచ్చినఅతి పెద్ద సర్ ప్రైజ్ గురించి చెబుతూ.. స్టాన్ ఫోర్డ్ లో అత్యధిక జీపీ సాధించినప్పుడు.. చంద్రబాబుతో సహా ఫ్యామిలీ అందరిని అమెరికాకు తీసుకురావటమేనని చెప్పారు. ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా.. చాలా సంతోషంగా అనిపిస్తుందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/