Begin typing your search above and press return to search.
బ్రాహ్మణి చెప్పిన ఆ రెండు రోజుల మాట
By: Tupaki Desk | 18 Jan 2017 10:11 AM GMTరాజకీయాలకు.. సినిమాలకు దూరంగా ఉంటూ నందమూరి ఫ్యామిలీలో కానీ.. నారా వారి ఫ్యామిలీలో కావొచ్చు.. ప్రజల్లో భారీ ఇమేజ్ ఉన్న వారు ఎవరంటే చటుక్కున చెప్పే పేరు బ్రాహ్మణి. ఎన్టీఆర్ మనమరాలిగా.. బాలకృష్ణ కుమార్తెగా.. లోకేశ్ సతీమణిగా.. చంద్రబాబు కోడలిగా సుపరిచితురాలై ఆమె చాలా తక్కువగా మాట్లాడుతుంటారు.
కానీ.. మాట్లాడే కొన్నిసార్లు అయినా.. స్పష్టతతో చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా.. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేస్తుంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఆమె.. మీడియా ముందుకు పెద్దగా రారు. తాజాగా ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆమె మరోసారి మీడియా ముందుకు రాక తప్పింది కాదు. తాతగారి వర్థంతిని పురస్కరించుకొని భారీగా ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 185 బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పిన బ్రాహ్మణి.. అందరికి ఒక సూచన చేశారు. రక్తదానం అవసరాన్ని చెబుతూ.. పుట్టినరోజు.. పెళ్లి రోజు లాంటి రెండు రోజుల్లో రక్తదానం చేయాలని.. అలా దానం చేసే రక్తంతో మరో ప్రాణం నిలుస్తుందని చెప్పారు. సింఫుల్ గా మాట్లాడినా.. అందరి మనసుల్ని తాకేలా మాట్లాడిన బ్రాహ్మణి మాటలు ఎంతోకొంతమంది మీద ప్రభావం చూపిస్తాయనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/