Begin typing your search above and press return to search.
ఇకనైనా ఆపండి..ఆమె రాజకీయాల్లోకి రారట
By: Tupaki Desk | 24 April 2017 10:26 AM GMTకొద్ది రోజులు ఏపీలో ఓ వార్త ప్రచారమవుతోంది. సీఎం చంద్రబాబునాయుడు కోడలు, లోకేశ్ సతీమణి, హీరో బాలయ్య ముద్దుల కుమార్తె నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తారని.. విజయవాడ నుంచి ఆమె లోక్ సభకు పోటీ చేయొచ్చని సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. లోకేశ్ ను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి తెచ్చి మంత్రిని చేసినా కూడా ఆయనకు వోట్ పుల్లింగ్ కెపాసిటీస్ లేవని చంద్రబాబుకు ఏ మూలో ఒక భయం ఉందని... అదే బ్రాహ్మణి అయితే ఛరిష్మాటిక్ లీడర్ అవుతారని.. అందుకే ఆమెను కూడా రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్నారని టీడీపీ వర్గాలు కూడా అనుకుంటూ ఉండేవి. అయితే... తాజాగా బ్రాహ్మణి మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయాలు అస్సలు ఇష్టం లేదని... వ్యాపార నిర్వహణే ఇష్టమని చెప్పారు. దీంతో ఇప్పుడిప్పుడే ఆమె రాజకీయాల్లోకి రాకపోవచ్చని భావిస్తున్నారు.
రాజకీయాలపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని బ్రాహ్మణి అన్నారు. తన ప్రస్తుత లక్ష్యం హెరిటేజ్ గ్రూపును మరింత అభివృద్ధి చేయడమే అని చెప్పారు. 2022 నాటికి హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని రూ. 6 వేల కోట్లకు పెంచడమే తన లక్ష్యమని తెలిపారు.
కాగా హెరిటేజ్ ఫుడ్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో బ్రాహ్మణి వ్యవహరిస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాదులోని తాజ్ డెక్కన్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో బ్రాహ్మణి మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. మరి... బ్రాహ్మణికి ఆసక్తి లేకపోయినా చంద్రబాబు ఉద్దేశం ఏమిటో తెలియాలి. మామయ్య ఆదేశిస్తే బ్రాహ్మణి రాజకీయాల్లోకి రానని చెప్పగలుగుతుందా ఏమిటనే వాదనా వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/