Begin typing your search above and press return to search.
వరుస వార్తల్లో బ్రాహ్మణి.. కొత్త సంకేతాలు?
By: Tupaki Desk | 24 Oct 2018 10:52 AM GMTఏదీ ఊరికే జరగదు. అందులోకి ఏళ్లకు ఏళ్లుగా ప్రముఖులుగా ఉన్నప్పటికీ రోజువారీ వార్తల్లో కనిపించని ఒక ప్రముఖురాలు.. ఉన్నట్లుండి రెండు.. మూడు రోజులుగా వరుస పెట్టి వార్తల్లోకి రావటం ఆసక్తికరమైన పరిణామమే. ఎవరో ప్రముఖురాలైతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు.. ఏపీ మంత్రి నారా లోకేశ్ సతీమణి.. ప్రముఖ సినీనటుడు కమ్ ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ కుమార్తె కావటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.
తారక్ సినిమాలు ఇప్పటికి చాలానే విడుదలయ్యాయి. ఏ రోజూ బ్రాహ్మణి రియాక్ట్ అయ్యింది కాదు. కానీ.. తాజా అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి ఆమె స్పందించటం.. తన తమ్ముడికి ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపటం ఆసక్తికర వార్తగా మారింది. ప్రముఖుల కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. బిజినెస్ ఉమెన్ గా ఉన్నా బ్రాహ్మణికి సంబంధించి వార్తలు చాలా పరిమితంగా వస్తుంటాయి.
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పించి ఆమె వార్తల్లో కనిపించరు. అందుకు భిన్నమైన పరిస్థితి తాజాగా నెలకొందంటున్నారు. తన బ్రదర్ తారక్ ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేయటం ఒక ఎత్తు అయితే.. స్పెషల్ గిఫ్ట్ పంపటం మరో ఎత్తు. ఇదంతా కుటుంబ వ్యవహారం అనుకుంటే.. ఆ విషయాలన్నీ బయటకు వచ్చేలా.. బ్రాహ్మణి ఇమేజ్ సరికొత్త గా బిల్డ్ అయ్యేలా ఉండటం ఏమిటి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. మరోసారి వార్తల్లోకి వచ్చేశారు.
తాజాగా సినీ నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. ఇప్పటివరకూ ఎవరూ పొగడని రీతిలో బ్రాహ్మణిని ఆయన పొగిడేశారు. తితలీ తుపాను కారణంగా అస్తవ్యస్తమైన సిక్కోలును ఆదుకునేందుకు ముందుకొచ్చి ఆపన్నహస్తం అందించేందుకు బ్రాహ్మణి ముందుకు రావటం.. ఏకంగా పది గ్రామాల్ని దత్తత తీసుకుంటున్నట్లుగా ప్రకటించటం విశేషంగా మారింది.
ఇప్పటివరకూ ఎంత పెద్ద ప్రముఖులైనా ఒకట్రెండు.. లేదంటే మూడు గ్రామాల్ని దత్తత తీసుకోవటమే కానీ.. బ్రాహ్మని మాదిరి ఏకంగా పది గ్రామాలను హోల్ సేల్ గా దత్తత తీసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. బ్రాహ్మణి దాతృత్వానికి మురిసిపోయిన మంచు మనోజ్ తాజాగా ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు.
శ్రీకాకుళం కోసం నారా బ్రాహ్మణి చేస్తున్నది చూస్తుంటే నిజంగా స్ఫూర్తి కలిగిస్తోంది.. నాకు తెలిసిన బలమైన మహిళల్లో ఆమె ఒకరన్నారు. ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న బ్రాహ్మణి కష్టాల్లో ఉన్న వారి కోసం నిలబడటం చూస్తుంటే అద్భుతంగా ఉందన్నారు. లయన్ కూతురు ఎప్పటికీ లయనెస్ జై బాలయ్య అంటూ ట్వీట్ చేశారు. ఇంతకాలం ఎప్పుడూ లేనిది పది గ్రామాలు దత్తత తీసుకోవటం.. బలమైన మహిళగా పొగడ్తలు వచ్చేయటం చూస్తుంటే.. బ్రాహ్మణికి సరికొత్త ఇమేజ్ ను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందన్న సందేహం రాక మానదు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ.. బ్రాహ్మణి ఇమేజ్ బిల్డింగ్ క్రమపద్ధతిలో జరుగుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం కాలమే సరిగ్గా చెప్పగలదు.