Begin typing your search above and press return to search.
మామ మెచ్చేలా మాట్లాడిన బ్రాహ్మణి
By: Tupaki Desk | 28 Nov 2017 8:37 AM GMTఏపీ సీఎం చంద్రబాబు సంగతి అందరికీ తెలిసిందేగా, ఎక్కడ ఏ గొప్ప జరుగుతున్నా అది నావల్లే అని అనడమో, లేదంటే అంతకుముందే తాను అలాంటిది చేశానని చెప్పడమో చేస్తుంటారు. ఇప్పుడు ఆయన కోడలు నారా బ్రాహ్మణి కూడా మామ రూట్లో నడుస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన ఆమె అక్కడ తన మాటలతో చంద్రబాబును గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా సదస్సును తాము గత ఏడాది అమరావతిలో సూపర్ సక్సెస్‌గా నిర్వహించామని చెప్పుకొచ్చారు. ఆమె మాటలు వినగానే అంతా... ‘ఎంతైనా ఆ ఇంటి కోడలే కదా’ అనుకున్నారట.
అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మాట్లాడుతూ, గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సు పారిశ్రామిక రంగానికి మరింత ఉపయుక్తకరంగా ఉంటుందన్నారు. ఈ సదస్సు వేదికగా యువత తమలోని ఆలోచనలను పంచుకోవచ్చని అన్నారు. ఇక్కడ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అపూర్వ అవకాశాలు దగ్గర కానున్నాయని, ఎన్నో ప్యానల్ డిస్కషన్స్ లో వారు పాల్గొన వచ్చని అన్నారు. ఈ చర్చల తరువాత వారు కూడా మరింత ఉన్నత స్థితికి ఎదగవచ్చని అన్నారు. తెలుగు నగరం హైదరాబాద్ ఈ సదస్సుకు వేదిక కావడం తనకు ఆనందాన్ని కలిగించిందని, ఇదే సమయంలో సదస్సు ఎక్కడ జరుగుతుందన్న సంగతి ముఖ్యం కాదని చెప్పారు. గత సంవత్సరం అమరావతిలో అతిపెద్ద మహిళా సదస్సును విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు.
తన గురించి చెబుతూ తాను వెంచర్ కాపిటలిస్టుగా ఉన్నానని, ఎన్నో కంపెనీలకు నిధులందిస్తున్నానని ఆమె అన్నారు. వ్యాపారాన్ని పక్కన బెట్టి, కుటుంబాన్నే చూసుకుంటే - మహిళదే ప్రధానపాత్రని - అదే స్థానాన్ని బిజినెస్ లోనూ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తే - వారు ఎంతో సాధిస్తారని అన్నారు. కాగా హెచ్ ఐసీసీ వద్ద బ్రాహ్మణిని చూసిన వివిధ రాష్ట్రాల మహిళా పారిశ్రామికవేత్తలు - ఆమెతో మాట్లాడుతూ - సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.