Begin typing your search above and press return to search.
మొన్న భువనేశ్వరి.. నేడు బ్రాహ్మణి.. ఎందుకు బాబు?
By: Tupaki Desk | 17 Jan 2020 4:50 AM GMTసుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ఎప్పుడూ చేయని పని ఇప్పుడు చేస్తున్నారా? అధికారంలో ఉన్నప్పుడు కానీ విపక్షంలో ఉన్న వేళలోనూ ఎప్పుడూ రాజకీయ సభలకు.. వేదికల మీదకు రాని బాబు సతీమణి భువనేశ్వరి ఇప్పుడు రావటం ఒక ఎత్తు అయితే.. తాజాగా మందడం.. వెలగపూడి.. తుళ్లూరులో జరిగిన దీక్షా శిబిరాలను సందర్శించిన బాబు వెంట భువనేశ్వరి.. బ్రాహ్మణిలు ఉండటం ఆసక్తికరంగా మారింది.
బాబు రాజకీయ వారసుడిగా తెర మీదకు వచ్చిన లోకేశ్ ప్రభావం చూపించకపోవటం.. ఆయన మాటలు.. చేతలు కామెడీగా మారటంతో పాటు.. సోషల్ మీడియాలో అయితే ఫన్నీ మీమ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న వేళ.. ఆయనకు బదులుగా తన రాజకీయ వారసుల్ని తెర మీదకు తీసుకొచ్చే ప్లానింగ్ లో బాబు ఉన్నారా? అన్నది ప్రశ్నగా మారింది.
రాజకీయంగా సంక్షోభాలు.. సవాళ్లు చంద్రబాబుకు కొత్తేం కాదు. కానీ.. ఏ సమయంలోనూ తన భార్యను.. కోడల్ని తెర మీదకు బాబు తీసుకురాలేదు. కానీ.. తాజాగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సాగుతున్న ఆందోళనలకు వీరిద్దరిని వెంట పెట్టుకొని తీసుకురావటం కొత్త వాదనలకు తెర తీస్తోంది. మొన్నటికి మొన్న రాజధాని కొనసాగింపు కోసం చేస్తున్న దీక్షలకు విరాళంగా తన రెండు ప్లాటినం గాజుల్ని ఇచ్చిన భువనేశ్వరి.. తొలిసారి రాజకీయ ఎజెండాతో ప్రజల మధ్యకు వచ్చారని చెప్పాలి.
తాజాగా దీక్ష శిబిరానికి భువనేశ్వరితో పాటు కోడలు బ్రాహ్మణిని తీసుకురావటం చూస్తే.. తన తర్వాతి రాజకీయ వారసుల విషయంలో బాబు మనసు మార్చుకున్నారా? కొత్త ఆలోచనలకు పదును పెట్టే క్రమంలో చిన్నపాటి లిట్మస్ టెస్టులు పెడుతున్నారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా సందర్శించిన దీక్షా శిబిరంలో బ్రాహ్మణి గంభీరంగా జరుగుతున్న మొత్తాన్ని గమనిస్తూ ఉంటే.. భువనేశ్వరి మాత్రం ప్రసంగించటం గమనార్హం.