Begin typing your search above and press return to search.

లోక్ సభకు బ్రాహ్మణి?

By:  Tupaki Desk   |   25 Oct 2016 8:34 AM GMT
లోక్ సభకు బ్రాహ్మణి?
X
ఏపీ కేబినెట్లోకి నారా లోకేశ్ చేరడానికి ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో టీడీపీలో మరో కీలకాంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అది లోకేశ్ భార్య, బాలకృష్ణ కుమార్తె అయిన నారా బ్రాహ్మణి ఎన్నికల్లో పోటీ చేయడం. అవును... వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణిని లోక్ సభకు పంపించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు - బాలకృష్ణ కుటుంబాల్లో నిర్ణయం జరిగిపోయిందని చెబుతున్నారు.

బ్రాహ్మణి పట్ల చంద్రబాబు మంచి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. హిందూపురం నుంచి కానీ, గుంటూరు స్థానం నుంచి కానీ పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు చోట్లా టీడీపీకి మంచి పట్టుంది. హిందూపురం లోక్ సభ స్థానం పరిధిలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి బ్రాహ్మణి తండ్రి బాలకృష్ణే ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆ రెండు చోట్లా ఎక్కడ నుంచి పోటీ చేసినా తిరుగుండదని అనుకుంటున్నారు.

పైగా బ్రాహ్మణికి ఉన్న ఛరిస్మా, ఆమె తెలివితేటలు, ఇమేజి కూడా పనికొస్తాయని భావిస్తున్నారు. కాలిఫోర్నియాలోని శాంతాక్లారా యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ లో హయ్యెస్టు జీపీఏతో పట్టా పొందిన బ్రాహ్మణి.. ప్రఖ్యాత స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే పూర్తి చేశారు. ఆమె నిర్వహణ నైపుణ్యాలూ అమోఘమని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టుకు సంబంధించిన పలు కార్యక్రమాల్లోనూ ఆమె తన సత్తా చాటారు. మరోవైపు ఆకట్టుకునేలా మాట్లాడగలరు. విషయ పరిజ్హానం - తొందరగా నేర్చుకునే తత్వం - ఛరిష్మా అన్నీ కలిసి పార్టీకి ఆమె మంచి అండ కాగలరన్నది చంద్రబాబు నమ్మకంగా తెలుస్తోంది. రాజకీయాలు ఇలాగే ఉండి కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వచ్చి , ఆ పార్టీతో టీడీపీ దోస్తీ కూడా కొనసాగితే బ్రాహ్మణిని కేంద్ర మంత్రిని కూడా చేయొచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/