Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ తిరగకుండా చేయాలి: చంద్రబాబు పిలుపు

By:  Tupaki Desk   |   29 July 2022 12:36 PM GMT
ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ తిరగకుండా చేయాలి: చంద్రబాబు పిలుపు
X
వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. జగన్‌ రూ.8 లక్షల కోట్లు అప్పుచేసి.. పోలవరం బాధితులకు మాత్రం రూ.20 వేల కోట్ల కోసం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. పరిహారానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. సాధించలేని అసమర్థుడు జగన్ అని దుయ్యబట్టారు. విలీన మండలాల్లో పర్యటించిన ఆయన వరద బాధితులను పరామర్శించారు.

అల్లూరి జిల్లా గన్నవరంలో ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. జగన్‌ రూ.8 లక్షల కోట్లు అప్పుచేసి.. పోలవరం బాధితులకు మాత్రం రూ.20 వేల కోట్ల కోసం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. పరిహారానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. సాధించలేని అసమర్థుడు జగన్ అని దుయ్యబట్టారు. దొంగల చేతికి తాళం ఇచ్చారు.. వారు ఇష్టానుసారం దోచుకుంటున్నారని మండిపడ్డారు.

పేటీఎం బ్యాచ్‌ జగన్‌కు వంద మార్కులు వేస్తే.. ప్రజలు మాత్రం సున్నా మార్కులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ అనంతబాబు బాధితులు ఎక్కువగా ఉన్నారని.. అనంతబాబును కాపాడే కొందరు పోలీసులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

అంతకుముందు తోటపల్లిలో ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. వరద బాధితులను ఆదుకోలేనంటూ సీఎం జగన్‌ చేతులెత్తేశారని మండిపడ్డారు. బాబాయిని చంపి ఆ కేసు నాపై పెట్టిన వాళ్లు.. ఇంకెవరినైనా చంపి మీపై పెడతారని ప్రజలకు హితబోధ చేశారు. నిజాయతీ, విశ్వసనీయత లేని నేతలతో రాష్ట్రానికే ప్రమాదమని సూచించారు. రోడ్డు మార్గాన వెళ్లి పరామర్శించలేని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు.

వరదలతో బాధిత ఇళ్లలో ఫ్యాన్ ఆగినందున.. ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ను ప్రజలు ఆపేయాల‌ని చంద్రబా బు పిలుపునిచ్చారు. పోలవరం పూర్తి చేయటం చేతకాకపోతే జగన్ రెడ్డి రాజీనామా చేయాలని, పోలవరం ఎందుకు పూర్తికాదో తాను చూస్తానని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రికి కుట్రలు కుతంత్రాలు తప్ప.. ఇంకేమీ తెలీదని ధ్వజమెత్తారు.

హుద్ హుద్ తుపాను సమయంలో టీడీపీ ప్రభుత్వం పరిహారం పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్ 9ను ఈ ప్రభుత్వం వరద బాధితులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం నందిగామ పాడు గ్రామంలో వరద ముంపు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు, పరిహారం అమలు బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని స్పష్టం చేశారు.