Begin typing your search above and press return to search.

ఈ చంద్రుడితో ఆ చంద్రుడికి చెక్ పెడతారా...?

By:  Tupaki Desk   |   5 March 2022 1:30 AM GMT
ఈ చంద్రుడితో ఆ చంద్రుడికి చెక్ పెడతారా...?
X
రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరూ అసలు ఊహించలేరు. ఇక్కడ అన్నీ సమీకరణమ మీదనే ఆధారపడతాయి. ఇక గాలి ఎటు వైపు వీస్తే అటు వైపుగానే చూసుకుంటూ లెక్కలు ఎక్కాలూ నేతలు వల్లె వేస్తారు. అలా కనుక చూస్తే ఏపీలో మాజీ సీఎం చంద్రబాబుకు మంచి రోజులు వచ్చినట్లే అనిపిస్తున్నాయి. చంద్రబాబు సీనియార్ మోస్ట్ పొలిటీషియన్. ఆయనకు జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి ఉంది.

అయితే చంద్రబాబు ఇపుడు కేవలం ఏపీ మీదనే తన ఫోకస్ మొత్తం ఉంచారు. కేంద్రంలో ఎవరు వచ్చినా సరే కానీ తనకు మాత్రం ఏపీ చాలు అని భావిస్తున్నారు. ఆ పనిలోనే ఆయన నిత్యం తలమునకలై ఉన్నారు. ఒక విధంగా బాబు ఢిల్లీ వైపు తొంగి చూడడంలేదు. కనీసం ఇతర నేతలతో ఫోన్లలోనూ ముచ్చట్లు పెట్టడంలేదు.

ఇదే ఇపుడు బీజేపీ పెద్దలను ఆకట్టుకుంటోంది అంటున్నారు. చంద్రబాబు శిష్యుడిగా ఉన్న తెలంగాణ చంద్రుడు కేసీయార్ మోడీ కే సవాల్ విసురుతున్నారు. బాబు తో పోలిస్తే కేసీయార్ కు జాతీయ స్థాయిలో పలుకుబడి తక్కువ. పైగా ఆయనది చిన్న రాష్ట్రం. అయినా కూడా కేసీయార్ బీజేపీ మీద పగబట్టినట్లుగానే వ్యవహరిస్తున్నారు.

నిజానికి బీజేపీ లెక్కల మేరకు తెలంగాణాలో కేసీయార్, ఏపీలో జగన్ తమకు అవసరానికి కలసి వస్తారని తలచారు. అయితే 2019 ఎన్నికల ముందు నుంచే కేసీయార్ తానేంటో చూపించి బీజేపీకి యాంటీగా ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. నాడు జగన్ బీజేపీకి అంది వచ్చారు. అయితే కేంద్రంలో ఫుల్ మెజారిటీ కాబట్టి పెద్దగా తెలుగు రాజకీయాల అవసరం పడలేదు.

ఇపుడు అంటే 2024కి మాత్రం బీజేపీకి చాలా అవసరాలు ఉన్నాయి. ఇక తెలుగు రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చేశాయి. కేసీయార్ బీజేపీకి రివర్స్ గా వెళ్తూంటే జగన్ పట్ల బీజేపీ మోజులన్నీ తగ్గిపోతున్నాయి. ఆయన పాలన పట్ల మెల్లగా జనాల్లో వ్యతిరేకత కూడా రాజుకున్న విషయాన్ని బీజేపీ ఇంటలిజెన్స్ గ్రహిస్తోంది. అదే టైమ్ లో చంద్రబాబు గ్రాఫ్ బాగా పెరుగుతోంది.

దాంతో బాబుతో జట్టు కడితే గరిష్ట లాభాలు అన్న అంచనాలలో ప్రస్తుతం బీజేపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. అదెలా అంటే బాబు గెలిస్తే ఏపీలో సీఎంగా ఉంటారు. ఆయన ఎంపీలు మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తారు. ఇక బాబుకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలతో మరింతమంది ఎంపీలను కూడగట్టి మూడవసారి కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటు అయ్యేందుకు సహకరిస్తారు.

ఇక బాబు కనుక ఒకసారి ఫీల్డ్ లోకి దిగితే జాతీయ రాజకీయాల్లో తెలంగాణా చంద్రుడి స్పీడ్ కి కూడా బ్రేకులు పడతాయని బీజేపీ నేతలు ఊహిస్తున్నారు. మొత్త్తానికి చూస్తే ఏపీ చంద్రుడితో తెలంగాణా చంద్రుడికి చెక్ పెట్టాలన్నది కాషాయ దళంలో సీరియస్ గానే సాగుతున్న డిస్కషన్ గా ఉందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజమైతే తెలుగు రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా పెను మార్పులు వచ్చేస్తాయి.