Begin typing your search above and press return to search.
జగన్ ఒంటరి : కేసీయార్...చంద్రబాబు లెక్కలు పక్కా ...?
By: Tupaki Desk | 21 Aug 2022 2:30 PM GMTరెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల రాజకీయాలు ఊపు అందుకుంటున్నాయి. రేపటి రోజున ఏం చేయాలి అన్న దాని మీద చాలా ముందుగానే వ్యూహాలు రూపొందిస్తున్నారు. నిజానికి తెలంగాణాలో ఎన్నికలు జరగాలంటే ఇంకా ఏడాదికి పైగా టైమ్ ఉంది. కానీ ఉప ఎన్నికలు వరసబెట్టి రావడంతో అధికార పార్టీ దానికి తగినట్లుగా తన ప్లాన్స్ కూడా రెడీ చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటిదాకా పొత్తుల ఎత్తుల మీద పెద్దగా స్పందించని టీయారెస్ ఫస్ట్ టైమ్ ఒంటరిగా వెళ్ళలేమని గ్రహించిందా లేదా పొత్తులు ఉంటే బెటర్ అని భావించిందా తెలియదు కానీ కమ్యూనిస్టులతో చేయి కలుపుతోంది.
దానికి మునుగోడు ఉప ఎన్నిక నాందీ ప్రస్థావనగా ఉంది. ఈ ఎన్నికలో సీపీఐ మద్దతుని గులాబీ పార్టీ తీసుకుంది ఈ సందర్భంగా మునుగోడుతోనే ఈ పొత్తు పరిమితం కాదని రానున్న ఎన్నికలలోనూ సాగుతుంది అని సభా వేదిక మీదనే కేసీయార్ గట్టిగా చెప్పేశారు. సీపీఐ తోనే కాకుండా సీపీఎం తో కూడా పొత్తులు కుదుర్చుకుని బరిలోకి దిగాలని టీయారెస్ భావిస్తోంది. ఈ రెండు పార్టీలకు డజన్ దాకా ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇవ్వాలని కేసీయార్ భావిస్తున్నారు.
కమ్యూనిస్టుల పొత్తులు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి చోట్ల టీయారెస్ కి ఓట్లు కలసివస్తాయని కేసీయార్ ఆలోచన. కనీసంగా నియోజకవర్గానికి వేయి ఓట్లు వంతున ఈ రెండు పార్టీలకు ఆయా జిల్లాలలో ఉన్నాయి. దాంతో రేపటి ఎన్నికల్లో టైట్ ఫైట్ సాగితే తక్కువలో అయినా గెలుపు దారిలో బయటపడవచ్చు అన్నది కేసీయార్ ఆలోచన. ఇక ఏపీలో చంద్రబాబు ఆలోచన చూస్తే ఆయన బీజేపీ జనసేనతో కలసి వెళ్లాలనుకుంటున్నారు. బీజేపీ ఇప్పటికిపుడు తేల్చకపోయినా ఎన్నికలకు దగ్గర చేసి అదే పాట పాడడం ఖాయం. అంటే చంద్రబాబు ఒంటరిగా 2024 ఎన్నికలను ఎదుర్కోరు అన్నది తేలుతున్న వాస్తవం.
బాబు ఇంకా మరో అడుగు ముందుకేసి వామపక్షాలను కూడా తమ కూటమిలోకి లాగినా లాగుతారు అని అంటున్నారు. అయితే బీజేపీతో ఉంటే అది కుదిరేది కాదు. దాంతో మహా ఘటబంధన్ అని పేరు పెట్టి చంద్రబాబు ఏపీ రాష్ట్రమే అజెండాగా అందరినీ కలవమని కోరే అవకాశం ఉంది. చూడాలి ఆ రాజకీయ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో. ఇక సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే తాము బీజేపీ వ్యతిరేక శక్తులను తెలుగు రాష్ట్రాలలో బలపరుస్తామని స్పష్టంగా చెప్పుకొచ్చారు.
తెలంగాణాలో అయితే టీయారెస్ మద్దతు ఇవ్వడం వెనక బీజేపీని నిలువరించడం అన్న అజెండా ఉందని నారాయణ చెప్పారు. బలంగా బీజేపీని అడ్డుకునేది కేసీయార్ ఒక్కరు మాత్రమే అని ఆయన అంటున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో చూస్తే అన్ని పార్టీలు బీజేపీ చుట్టూనే తిరుగుతున్నాయని నారాయణ విమర్శించారు. ఈ దేశానికి బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని అంతా గ్రహించి ఆ నీడ నుంచి బయటపడాలని ఆయన పిలుపు ఇచ్చారు. అలా బయటపడిన పార్టీలతో జట్టు కట్టాలని వామపక్షాలకు ఆలోచన ఉందని తెలుసోంది.
మరో వైపు చూస్తే రేపటి ఎన్నికల వేళకు బీజేపీ టీడీపీ కలిస్తే కచ్చితంగా వైసీపీ బీజేపీకి దూరం అవుతుంది. అది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ సమయంలో వైసీపీతో కమ్యూనిస్టులు వెళ్ళి కలుస్తారా అంటే అది చెప్పలేమనే అంటున్నారు. జగన్ కి ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన ఈ రోజు వరకూ ఉంది. అయితే సీపీఎం పట్ల ఆ మధ్య కాలంలో వైసీపీ కొంత సానుకూలతను చూపించింది. దాంతో వచ్చే ఎన్నికల్లో సీపీఎం తో వైసీపీ కలుస్తుందా అన్నది కూడా ఒక చర్చగా ఉంది.
ఏది ఏమైనా తన సొంత బలాన్నే నమ్ముకుని వైసీపీ వస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఆ విధంగా చూస్తే జగన్ ఒంటరిగానే మిగిలిపోతారు అని చెప్పాలి. మరి జగన్ కి మిత్రుడు లాంటి టీయారెస్ కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుంటే ఈ రోజు కాకపోయినా ఎన్నికల వేళ అయినా జగన్ ఆ దిశగా అడుగులు వేస్తారా అన్నది కూడా చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే పొత్తులతోనే వచ్చే ఎన్నికల్లో నెగ్గగలమని భావిస్తున్న బాబు, కేసెయార్ లెక్కలు మాత్రం పక్కాగానే ఉన్నాయని అంటున్నారు.