Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు కేసీయార్ పచ్చ జెండా...?
By: Tupaki Desk | 9 Oct 2022 9:20 AM GMTఆ ఇద్దరూ గురువు శిష్యులు. అది టీడీపీలో ఉన్నపుడు. ఈ మాటలను ఆ పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్న వారు చెబుతారు. ఆ ఇద్దరే చంద్రబాబు, కేసీయార్. అయితే ఇపుడు మాత్రం బాబుకు తాను శిష్యుడిని అంటే కేసీయార్ అసలు ఒప్పుకోరు. అలాగే కేసీయార్ ని తన శిష్యుడిగా భావించి అక్కున చేర్చుకోవడానికి బాబు కూడా సుముఖంగా ఉండరనే అంటారు.
ఇదిలా ఉంటే నాలుగు ఆకులు బాబు కంటే ఎక్కువ తాను చదివాను అని భావించే కేసీయార్ 1999 ఎన్నికల తరువాత తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు ఏకంగా ఉమ్మడి ఏపీలో బాబు మరోసారి సీఎం కాకుండా చేసేలా తెలంగాణా ఉద్యమం నడిపారు. మళ్ళీ సీఎం కుర్చీ బాబుని ఎక్కనివ్వను అన్న మాటను ఆయన అలా నిలబెట్టుకున్నారు ఆ తరువాత విభజన ఏపీకే బాబుని పరిమితం చేసి ఒక పెద్ద గీత గీసేసి తెలంగాణా తన అడ్డా అని చాటి చెప్పుకున్నారు.
అయితే కాలం ఎపుడూ ఒక్కలా ఉండదు. కేసీయార్ అతి తెలివి తేటలు విపరీతమైన రాజకీయ వ్యూహాలతో ఇపుడు ఆ గీత చెరిగిపోయింది. టీయారెస్ ని బీయారెస్ గా మారుస్తూ కేసీయార్ తీసుకున్న నిర్ణయంతో ఆయన ఎంతవరకూ ఏపీలో ఎంట్రీ ఇచ్చి తన కొత్త పార్టీ పునాదులను బలంగా నిర్మించుకుంటారో తెలియదు కానీ బాబుకు మాత్రం పక్కాగా తెలంగాణా లో ఎంట్రీకి లైన్ క్లియర్ చేసి పారేశారు అని అంటున్నారు.
చంద్రబాబుకు ఇపుడు ఎలాంటి పేచీ పూచీ లేకుండా తన పార్టీని తెలంగాణాలో విస్తరించుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశం లభించింది అని అంటున్నారు. నిజానికి టీడీపీ పుట్టింది తెలంగాణాలో. అలాగే టీడీపీకి ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నది అక్కడే. బీసీలు బాగా ఉన్న తెలంగాణాలో టీడీపీ పునాదులు కూడా ఈ రోజుకీ గట్టిగా ఉన్నాయి.
అయితే చంద్రబాబుని ఆంధ్రా బాబుగా విమర్శిస్తూ కేసీయార్ ఆడిన రాజకీయ గేమ్ కారణంగా టీడీపీ చాలా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పటికీ టీడీపీకి హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ సహా కొన్ని జిల్లాలలో పట్టు ఉంది. మళ్ళీ రిపేర్లు చేసుకుంటే టీడీపీ తెలంగాణాలో గట్టిగా నిలబడే అవకాశం ఉంది అంటున్నారు.
ఇక బీయారెస్ గా తన పార్టీని మార్చేసిన తరువాత కేసీయార్ బాబుని తెలంగాణాలో రాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ నిరోధించలేదు. అదే టైం లో చంద్రబాబు ఇపుడు అసలైన రాజకీయం ఏంటో చూపిస్తారు అని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని కేసీయార్ ని గద్దె దించడానికి చూస్తారు అని అంటున్నారు. ఆంధ్రా పార్టీలు వచ్చి తెలంగాణాను ఏలుతాయని 2023 ఎన్నికల్లో కేసీయార్ గగ్గోలు పెట్టే సీనే ఉండదు.
అలా అంటే ఆయన ఏపీలో తెలంగాణా పార్టీగా వచ్చి పెత్తనం చేయవచ్చునా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇంకో వైపు చూస్తే టీయారెస్ లో ఉన్న వారంతా మాజీ టీడీపీ తమ్ముళ్ళే. వారిలో చాలా మంది విసిగి వేసారినా తప్పదని రాజకీయం చేస్తున్న వారే ఉన్నారు. ఇపుడు కేసీయార్ తెలంగాణా గొళ్ళాన్ని తానుగానే తీసి పారేశారు కాబట్టి ఎవరికి వారు స్వేచ్చగా నచ్చిన పార్టీలలో చేరే సీన్ ఉంటుంది.
అలా టీయారెస్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతుంది అన్న డౌట్లు ఉంటే కనుక కచ్చితంగా టీయారెస్ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే కేసీయార్ జాతీయ పార్టీ కాదు చంద్రబాబు తన టీడీపీని జాతీయ పార్టీగా చేసుకుని తెలంగాణాలో పెంచుకునే చాన్స్ ఇచ్చేశారు అని అంటున్నారు. తెలంగాణాలో టీడీపీకి అతి పెద్ద పార్టీ ఆఫీస్ ఉంది. సీమాంధ్రుల అండ ఉంటుంది. దాంతో పాటు హైదరాబాద్ ని సూపర్ గా అభివృద్ధి చేశారన్న ఇమేజ్ బాబుకు సొంతం.
అలా కనుక చూస్తే టీడీపీకి మంచి అవకాశాలు తెలంగాణాలో ఉన్నాయనే అంటున్నారు. బీయారెస్ అని అతికి పోయి కేసీయార్ తెలంగాణా నినాదాన్ని పక్కన పెట్టేడయం దారుణమైన చారిత్రాత్మకమైన తప్పు అనే అంటున్నారు. దాని వల్ల ఆంధ్రా పార్టీలు ఇపుడు బోర విడుచుకుని తెలంగాణాలో రాజకీయం చేసినా కిమ్మనే సీన్ ఉండదనే అంటున్నారు. చివరికి అది టీయారెస్ అస్థిత్వానికే దెబ్బ తీసేలా ఉంటే మాత్రం ఆ తప్పు నూటికి నూరు శాతం కేసీయార్ దే అవుతుంది అని అంటున్నారు. సో 2023 ఎన్నికలు మాత్రం కేసీయార్ కి ఆషామాషీవి కావు అనే చెబుతున్నారు. ఎందుకంటే ఇపుడు చంద్రబాబు తెలంగాణాలో చక్రం తిప్పుతారు అని అంటున్నారు.