Begin typing your search above and press return to search.

బస్సులో చంద్రబాబు... కాలినడకన లోకేష్ బాబు... ?

By:  Tupaki Desk   |   8 March 2022 12:30 AM GMT
బస్సులో చంద్రబాబు... కాలినడకన లోకేష్ బాబు... ?
X
ఏపీలో ఈసారి వేసవి మామూలుగా ఉండదు అని వాతావరణ కేంద్రం అపుడే హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేకించి ఏపీలో ఈ వేసవి నుంచి మంటలు పుట్టడం ఖాయమని తెలుగుదేశం రాజకీయం హెచ్చరిస్తోంది. టీడీపీ అధినాయకులు ఇద్దరూ ఏపీ అంతా చుట్టేయడానికి డిసైడ్ అయిపోయారు. ఈ ఏడాది మే 27, 28లలో మహానాడుని పెద్ద ఎత్తున టీడీపీ నిర్వహించనుంది. పార్టీ పరంగా దాన్ని ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే తీర్మానించారు.

మహానాడు ఇలా ముగియడంతోనే చంద్రబాబు, చినబాబు అలా ఏపీలో నలుమూలల్లొ చుట్టేయడానికి భారీ ప్రణాళికలను పార్టీ సిద్ధం చేసేసింది. ఈ ఏడాది మే 30తో జగన్ సర్కార్ కి మూడేళ్లు నిండుతాయి. దాంతో రానున్న రెండేళ్ల కాలం తండ్రీ కొడుకులు జనాలకు సన్నిహితంగా ఉండేలా టీడీపీ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తోంది

చంద్రబాబు ఈసారి బస్సు యాత్ర ద్వారా జనాల వద్దకు రానున్నారు. ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రాం ని డిజైన్ చేశారు. ఇక లోకేష్ బాబు అయితే యువకుడు, ఏపీ రాజకీయాల్లో ఫోకస్ పెరగాల్సిన నేత కావడంతో ఆయన పాదయాత్ర ద్వారా జనాల వద్దకు వెళ్ళేలా టీడీపీ వ్యూహకర్తలు ప్లాన్ చేశారు. దీని ప్రకారం లోకేష్ బాబు రాయలసీమ నుంచి తమ పాదయాత్రను ప్రారంభిస్తారు

రాయలసీమ అంటే వైసీపీకి కంచుకోటలాంటిది. అక్కడే టచ్ చేయడం ద్వారా అధికార పార్టీకి చుక్కలు చూపించాలన్న లక్ష్యంతోనే లోకేష్ ని అక్కడ టీడీపీ బాణంగా ప్రయోగిస్తున్నారు. ఇక చంద్రబాబు అయితే తన బస్సు యాత్రను ఉత్తరాంధ్రా జిల్లాల‌ నుంచి మొదలుపెట్టనున్నారు. ఉత్తరాంధ్రా టీడీపీకి కంచు కోట. 2019 ఎన్నికలు తప్ప అన్ని సార్లూ టీడీపీయే ఇక్కడ గెలిచింది. దాంతో ఈసారి టోటల్ సీట్లను సాధించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు సెంటిమెంట్ గా ఉత్తరాంధ్రాను ఎంచుకున్నారు అని అంటున్నారు.

ఇక లోకేష్ పాదయాత్ర సుదీర్ఘ కాలం పాటు సాగుతుంది. మొత్తానికి మొత్తం ఏపీలోని 175 నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. చంద్రబాబు బస్సు యాత్ర ముఖ్యమైన నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ సాగుతుంది అంటున్నారు. ఇక తెలుగుదేశం ఎప్పటికపుడు చేస్తున్న సర్వేలు ఉత్తరాంధ్రాతో పాటు రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కర్నూల్ లలో వైసీపీకి పూర్తి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పేర్కొన్నాయి.

దాంతో అధికార పార్టీకి ఇక్కడ నుంచే చెక్ చెప్పాలన్న భారీ టార్గెట్ తో లోకేష్, చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికలు అయ్యేంతవరకూ కూడా ఈ ఇద్దరు నేతలూ పూర్తి కాలం ప్రజలలో ఉండేలా కార్యక్రమాలను డిజైన్ చేశారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, క్రిష్ణా గుంటూర్లలో బలంగా ఉంది. దాంతో. ఇక్కడ టీడీపీ జనసేన కలిస్తే కచ్చితంగా వార్ వన్ సైడ్ అవుతుంది అంటున్నారు.

మిగిలిన చోట్ల వైసీపీకి వ్యతిరేకంగా జనాభిప్రాయాన్ని కూడగడితే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలు ఆడడం ఖాయమని అంటున్నారు. సరైన వ్యూహంతో సరైన సమయంలో టీడీపీ ఈ యాత్రలకు దిగుతోంది. ఇది అధికార వైసీపీకి అధికార వియోగ యాత్రగా పరిణమిస్తుందని తమ్ముళ్ళు గట్టి విశ్వాసంతో ఉన్నారు.