Begin typing your search above and press return to search.
పొరుగు పాలిటిక్స్ : జగన్.. బాబు.. మధ్యలో తెలంగాణా...?
By: Tupaki Desk | 21 May 2022 2:30 AM GMTఏమిటో ఉమ్మడి ఏపీ రెండుగా విభజించబడినా కూడా తెలంగాణా ఊసు లేకుండా పొత్తు వాలదు, రాజకీయం అయితే అసలు ఆగదు. నిజానికి విడిపోయినా తెలంగాణా ఎక్కడ దూరం అయిందని. ఏపీకి చెందిన జనాలు అక్కడే ఉంటున్నారు. అంతకు మించి తెలంగాణాలోనే ఏపీ రాజకీయ నేతలు అంతా సెటిల్ అయిపోయారు.
ఈ మాట గతంలో టీడీపీ అంటూ ప్రవాసాంధ్రులు అని తెగ ఇదిగా వాడేసుకుంది. ఇపుడు దాన్ని రివర్స్ గేర్ లో వైసీపీ కూడా పవర్ ఫుల్ గా వాడుకుంటోంది. ఇంతకీ ఏపీ రాజకీయాల్లో ఎందుకు తెలంగాణా మధ్యలో వస్తోంది అంటే అందరి ఆవాసాలూ అవశేషాలు అక్కడే కదా. అందుకే ఈ పంచ్ డైలాగులు ఎపుడూ పచ్చిగానే పేలుతాయి. అసలు ఏ కోశానా వదలవంతే.
ఏపీలో బీసీలు లేరా. తెలంగాణాకు చెందిన ఆర్ క్రిష్ణయ్యకు పిలిచి మరీ బీసీగా ముందు పెట్టి ఎంపీ సీటు ఇస్తారా అంటూ చంద్రబాబు నుంచి మొదలుపెట్టి టీడీపీ నేతలు అంతా గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు. ఎవరూ అడగరని జగన్ భావిస్తూ నియంత పాలన చేస్తున్నారు అని బాబు కడప టూర్లోనే ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు.
దీంతో ఇపుడు రిటార్ట్ ఇవ్వడం వైసీపీ వంతు అయింది. అందుకే బీసీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలంగాణా బీసీ అని అంటున్న చంద్రబాబు తాను ఎక్కడ ఉంటున్నారో అసలు విషయాన్ని విప్పి జనాలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి తెలంగాణా విపక్ష నేతగా బాబు గారు లేరా అని ఆయన ఎద్దేవా చేశారు. అక్కడ ఉంటూ ఏపీ రాజకీయం చేస్తున్న బాబు ప్రాంతీయ తత్వాన్ని నెత్తికెత్తుకోవడమేంటి అని కూడా నిలదీశారు.
ఇక చంద్రబాబు తన పదవీ కాలంలో ఒక్క బీసీకైనా రాజ్యసభ సీటు ఇచ్చిన చరిత్ర ఉందా అని కూడా ధర్మాన అడుగుతున్నారు. క్రిష్ణయ్య తెలంగాణాకు మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో బీసీలను ప్రభావితం చేసే నాయకుడు. ఆయన్ని తగ్గించాలని చూడడం తగదని కూడా ధర్మాన సహా బీసీ మంత్రులు అంటున్నారు.
మొత్తానికి ఆ మధ్యన కూడా కేరాఫ్ హైదరాబాద్ బాబుకు ఏపీ రాజకీయాలతో ఏమి పని అంటూ వైసీపీ నేతలు ఎకసెక్కమాడేవారు. ఇపుడు మరో మారు ఆయన్ని ప్రవాసాంధ్రుడు అని ట్యాగ్ తగిలించి ఏపీకి దూరం చేస్తున్నారు. మరి చంద్రబాబు భవంతి అక్కడే ఉందాయే. దాంతో ఆయన కూడా ఇపుడు ఏమీ అనలేని పరిస్థితి.
మొత్తానికి ఒక్క ఎంపీ సీటు కోసం టీడీపీ నేతలు నోరు చేస్తే ఏకంగా ఏపీకి తెలంగాణా విపక్ష నేత బాబు గారు అనేంతలా వైసీపీ వెళ్ళిపోయింది. దీంతో బాబు జగన్ ల మధ్య మాటల యుద్ధం కాదు కానీ మధ్యలో తెలంగాణా పడి నలుగుతోంది అంటున్నారు. ఇవన్నీ చూసీ మీ పాలిటిక్స్ లోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు అంటూ అక్కడి నాయకులు తగులుకోవడం ఒక్కటే మిగిలేట్టు ఉంది.