Begin typing your search above and press return to search.
బీసీలు ఓబీసీలు చమటలు పట్టిస్తారా...? ..జగన్...బాబు పోటా పోటీ
By: Tupaki Desk | 1 Jan 2023 3:18 PM GMTఏపీలో ఎన్నికలు అంటేనే సామాజిక వర్గాల సమీకరణం. ఒక విధంగా చెప్పాలీ అంటే సంకుల సమరం. వివిధ సామాజిక వర్గాలను టార్గెట్ చేసి వారిని మచ్చిక చేసుకుని మరోసారి అధికారాన్ని అందుకోవడం కోస్మ్ ఏపీలో రాజకీయ పార్టీ పోటీ పడుతున్నాయి. ఒక వైపు కాపుల ఓట్లు ముఖ్యమే అని చెబుతూనే బీసీలకు కూడా గేలం వేస్తున్నాయి అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం.
తెలుగుదేశం పార్టీ అయితే బీసీలు బ్యాక్ బోన్ అని చాటుకుంటోంది. వారు తమకు ఎపుడూ మద్దతుగా ఉంటున్నారు అని చాటుకుంటఒంది. అదే జగన్ అయితే బీసీలు సామాజికే బ్యాక్ బోన్ అంటూ అతి పెద్ద డెఫినిషన్ ఇచ్చేశారు. వారికి నిజమైన అధికారాన్ని తమ పార్టీ ఇస్తోంది అని చెప్పుకుంటున్నారు. ఏపీలో బీసీలు, ఓబీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఒక లెక్క ప్రకారం చూస్తే యాభై శాతం దాటి ఉన్నారు. ప్రతీ నియోజకవర్గంలో వారు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. దాంతో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. తమ మంత్రివర్గంలో వారికి కీలక శాఖలను అప్పగించారు. అలాగే నామినేటెడ్ పోస్టుల నుంచి రాజ్యసభ సీట్ల దాకా బీసీలకు ఇచ్చారు. కాపోరేషన్లకు మేయర్లుగా జెడ్పీ చైర్మన్లుగా వారినే నియమించారు. ఎమ్మెల్సీ పదవులలో కూడా ప్రయారిటీ ఇచ్చారు.
తాము బీసీలల్కు 84 వేల పైగా పోస్టులు ఇచ్చామని ఈ మధ్యనే జయహో బీసీ అంటూ వైసీపీ విజయవాడలో భారీ ఎత్తున సదస్సుని నిర్వహించింది. దానికి హాజరైన జగన్ రెండు గంటల పాటు ప్రసంగించి బీసీలను ప్రసన్నం చేసుకున్నారు. మరో వైపు చూస్త రాష్ట్రంలో మరిన్ని బీసీ సభలను నిర్వహించాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా బీసీలకు సీట్లు ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయింది.
ఇక చంద్రబాబు ఇదంతా చూస్తూ ఊరుకుంటారా. అందుకే ఆయన నెల్లూరు జిల్లా పర్యటనలో బీసీలకు తెలుగుదేశం చేస్దిందే ఎక్కువ అని గట్టిగా వాదించారు. తమతో డిబేట్ కి వస్తే బీసీలకు ఏమి చేసిందో చెబుతామని సవాల్ విసిరారు. అంతటితో ఆయన ఆగలేదు. 2024లో తాము ఎన్నికల్లో వస్తే బీసీల సంక్షేమానికి సంబంధించిన ఫైల్ మీదనే తొలి సంతకం చేస్తాను అని భారీ వాగ్దానం చేశారు.
అంతే కాదు ఏపీలో మూడున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఎంత మేలు చేసిందో శ్వేత పత్రం రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా బీసీల విషయంలో అటు అధికార పక్షం వైసీపీ ఇటు విపక్షం తెలుగుదేశం సవాళ్ళు విసురుకుంటున్నా కూడా నిజంగా బీసీలకు మేలు ఏమి జరిగింది అంటే లేదు అనే అంటున్నారు. బీసీలకు నిజమైన రాజ్యాంగపు హక్కులు అధికారాలు నేటికీ దక్కలేదు అనే అంటున్నారు.
ఏపీలో బీసీలు సంఖ్యాపరంగా అత్యధిక శాతం ఉంటున్నా కూడా వారు ఎపుడూ ముఖ్యమంత్రి కాలేదని అంటున్నారు. కేవలం కొన్ని మంత్రి పదవులు ఇచ్చినా అసలైన అధికారాలు ముఖ్యమంత్రి వద్దనే ఉంటాయని వారికీ తెలుసు అంటున్నారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని ఈ మధ్యనే బీసీ నేతలు కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చూస్తే బీసీలు ఎటు వైపు మద్దతు ఇచ్చినా కూడా వారు సీఎం అయ్యేది లేదు అనే అంటున్నారు.
తెలుగుదేశం వస్తే కమ్మ, వైసీపీ వస్తే రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు తప్ప వేరే ఉపయోగం ఏదీ బీసీలకు ఉండదని అంటున్నారు. బీసీలకు శాశ్వత బీసీ కమిషన్ మేము ఏర్పాటు చేశామని వైసీపీ చెప్పుకోవచ్చు. మేము ఆదరణ పేరిట పధకాన్ని అమలు చేసి సంక్షేమానికి పెద్ద పీట వేశామని టీడీపీ గట్టిగా చెప్పవచ్చు. కానీ ఈ రెండు పార్టీల నుంచి బీసీ నేతను సీఎం గా చేస్తామని ప్రతిపాదన వస్తుందా అంటే అది ప్రపంచ వింత తప్ప మరేమీ కాదనే అంటున్నారు.
మరి బీసీలు ఎప్పటి మాదిరిగా అనైక్యతతో ఉంటూ ఈ రెండు పార్టీలను నమ్ముకుని ముందుకు సాగేలానే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఏ పార్టీ వైపు ఎక్కువ శాతం మద్దతు ఇస్తారో వారిదే అధికారం. మరి బీసీలు ఓబీసీల ఆలోచనలు అడుగులు ఎటు వైపు అన్నదే చర్చగా ఉంది.