Begin typing your search above and press return to search.

ఇలా అయితే.. మార్చేస్తా.. పెందుర్తి వెంక‌టేష్‌కు బాబు వార్నింగ్‌

By:  Tupaki Desk   |   16 Oct 2022 12:30 PM GMT
ఇలా అయితే.. మార్చేస్తా.. పెందుర్తి వెంక‌టేష్‌కు బాబు వార్నింగ్‌
X
తూర్పు గోదావ‌రి జిల్లా రాజాన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌తో చంద్ర‌బాబు తాజాగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డి ఎమ్మెల్యే అభ్య‌ర్థి పెందుర్తి వెంక‌టేష్‌ను ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు. పార్టీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌క‌పోతే ఎలా.. అంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. `బాదుడే బాదుడు` కార్య‌క్ర‌మంలో ఎందుకు పాల్గొన‌డం లేద‌ని.. ప్ర‌శ్నించారు. అంతేకాదు.. త‌న ద‌గ్గ‌రకు ఇంత మందిని ఎందుకు తీసుకువ‌చ్చారంటూ.. ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. మ‌ర్యాద ఇచ్చి పుచ్చుకోవాల‌ని వ్యాఖ్యానించారు. ``ఇంత మంది ఎందుకు వ‌చ్చారు వెంక‌టేష్‌`` అంటూ.. పెందుర్తిని ప్ర‌శ్నించారు.

ఇలా అయితే.. క‌ష్ట‌మేన‌ని.. మీరు మార‌క‌పోతే.. మార్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాన‌ని.. పార్టీ ఎవ‌రి కోసం.. త్యాగాలు చేయ‌బోద‌ని.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రూ..పార్టీ కోసం ప‌నిచేయాల‌ని సూచించారు. రాజా న‌గ‌రంలో ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా.. విమ‌ర్శ‌లు చేస్తుంటే.. మీరంతా చూస్తూ కూర్చున్నారా? అని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ వాళ్లు దూకుడుగా ముందుకు సాగుతుంటే.. మీరుఏం చేస్తున్నార‌ని.. నిల‌దీశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నామ‌ని.. ఈ విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గుర్తు పెట్టుకోవాల‌ని చెప్పారు.

అలా కాకుండా.. ఎవ‌రి అజెండా వారికి ఉంటే.. ఎవ‌రి ఇష్టానుసారం వారు వ్య‌వ‌హ‌రిస్తామంటే.. పార్టీ ఏం చేయాలో అది చేస్తుంద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ప్ర‌తి విష‌యంలోనూ.. అంద‌రికీ.. కొన్ని ప‌రిమితులు ఉంటాయ‌ని. కానీ, మీరు అన్నీ క్రాస్ చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా వెంక‌టేష్‌ను వుద్దేశించి.. తీవ్రంగానే చంద్ర‌బాబు హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో రెండు సార్లు వరుస విజ‌యాలు ద‌క్కించుకున్న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఇప్పుడు ఎందుకు బ‌ల‌హీన ప‌డింద‌ని ప్ర‌శ్నించారు. పార్టీ చెప్పింది ఎవ‌రూ చేయ‌డం లేద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో ఎవ‌రికోసం.. తాను రిస్క్ చేయ‌బోన‌ని వెల్ల‌డించారు. కాగా, 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న వెంక‌టేష్ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయితే.. ఆయ‌న పార్టీ కోసం ప‌నిచేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి.