Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డే స్పెష‌ల్ : తిరుగులేని నేత .. బాబు బంగార‌మే !

By:  Tupaki Desk   |   19 April 2022 5:30 PM GMT
బ‌ర్త్ డే స్పెష‌ల్ : తిరుగులేని నేత .. బాబు బంగార‌మే !
X
ఓ విధంగా చెప్పాలంటే ఆయ‌న‌కు క‌ష్టాలు కొత్త‌వి కావు. ఆ విధంగా ఆయ‌న ముందుకు వెళ్లారు. వెన‌క్కు త‌గ్గారు.. ముందు వెనుకల న‌డుమ ఊగిస‌లాడారు. ఊహ‌ల‌కు రూపం ఇచ్చారు. రెండు ప్ర‌ధాన న‌గ‌రాల‌కు గొప్ప వైభ‌వం తేవాల‌ని అనుకున్నారు.

ఆ విధంగా ఆ రోజు భాగ్య న‌గ‌రి విష‌య‌మై ఎన్నో విజ‌యాలు అందుకున్నా, అమ‌రావ‌తి విష‌య‌మై ఆ జోష్ కొన‌సాగించ‌లేక‌పోయారు. ఏదేమ‌యినా ఆంధ్రుల క‌ల‌ల న‌గ‌రిని పూర్తి చేసే రోజు ఆయ‌న జీవితంలో ముందున్న కాలంలో రావాల‌న్న‌ది తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోరిక.. నెర‌వేర్పు అన్న‌ది కాలం చేతిలో ఉన్న ప‌ని!

హైటెక్ సీఎం అని ఆయ‌న‌ను పిలుస్తారు.. ఆ విధంగా ఆయ‌న ఉమ్మ‌డి రాష్ట్రంలో వైఎస్ కు దీటుగా ఎదిగిన నేత. ఆ మాట‌కు వ‌స్తే కేసీఆర్ లాంటి వారికి కూడా రాజ‌కీయ పాఠాలు నేర్పిన నేత. కొన్ని త‌ప్పిదాలే ఆయ‌న‌ను కొంత నిలువ‌రించాయి కానీ ఆయన విజ‌న్ కార‌ణంగా ఎదిగిన వారున్నారు. ఆయ‌న అభివృద్ధిని కొనసాగించి మంచి పేరు తెచ్చుకున్న ముఖ్య‌మంత్రులు కూడా ఉన్నారు.

ఇదే మాట మొన్న‌టి వేళ ఎన్టీఆర్ భ‌వ‌న్ (హైద్రాబాద్)లో చెప్పారు కూడా ! ఓ విధంగా ఆ రోజు హైద్రాబాద్ పైనే ప్రేమ పెంచుకున్నారు ఆయ‌న. ఆ ప్రేమ కార‌ణంగా ఆయ‌న ఎన్నో అభివృద్ధి ప‌నులు చేశారు. ఈ న‌గరాన్ని ఐటీ హబ్ గా మార్చారు. ఆ విధంగా ఆయ‌న త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఉన్న లీడ‌ర్ అయ్యారు.

ఓ మారుమూల ప్రాంతం నుంచి చిత్తూరు జిల్లా నుంచి ఎదిగి వ‌చ్చిన నేత‌గా పేరుంది ఆయ‌న‌కు.. ఇవాళ కొందరు ఆయ‌న‌ను కించ‌ప‌రిచి మాట్లాడ‌డం మాత్రం త‌గ‌దు.. ఆ విధంగా ఎవ్వ‌రు చేసినా త‌ప్పే ! ఎందుకంటే ఆయ‌న ప‌రిధిలో చేసినంత అభివృద్ధి ఇప్ప‌టి పాల‌కులు కూడా చేస్తే అప్పుడు మాట్లాడాలి అని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు హిత‌వు చెబుతున్నారు.

రేపు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు బ‌ర్త్ డే. 71ఏళ్లు నిండుతున్నాయి ఆయ‌న‌కు. 72 వ ఏట అడుగుపెడుతున్నా రు. ఈ శుభ సంద‌ర్భంగా ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతూ రాస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం ఇది. ప్ర‌స్తుతం ఆయ‌న దృష్టి అంతా విజ‌న్ 2024 పైనే ఉంది.

ఎందుకంటే రానున్న కాలం అంతా ఎన్నిక‌ల‌కు సంబంధించి స‌మాయ‌త్తం కావాల్సిన స‌మ‌య‌మే ! క‌నుక ఆయ‌న ఇంతటి భారాన్ని మోస్తూ పార్టీ శ్రేణుల‌ను స‌మాయ‌త్త ప‌రుస్తూ 44 ఏళ్ల పాటు పార్టీ న‌డ‌క‌లో మార్పులు తీసుకువ‌స్తూ బాబు తిరుగులేని నేత‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి తో పాటు చెడ్డ పేరు కూడా ఉందా? అంటే.. ఆయ‌న కొన్ని విష‌యాల‌లో త‌ప్పిదాలు చేసి చెడ్డ‌పేరు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా ఆ రోజు అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న మాట నెగ్గ‌లేదు.. ఆవిధంగా ఆయ‌న చెడ్డ‌పేరు తెచ్చుకున్నారు. మంచి చెడుల మేలు క‌ల‌యిక‌లో ఆయ‌న కొన్ని త‌ప్పిదాల‌కు దూరంగా ఉండేందుకు ప్ర‌యత్నించినా నారాయ‌ణ లాంటి లీడ‌ర్ల కార‌ణంగా ఆయ‌న చ‌రిష్మా త‌గ్గిపోయింది. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ పార్టీ కోస‌మే ప‌రిత‌పించారు. ప‌రిశ్ర‌మించారు.

అందులో సందేహాల‌కు తావే లేదు. అయితే కొన్ని సార్లు అమ‌రావ‌తి నిర్మాణం పేరిట ఒక్క ప్రాంతానికే ఆయ‌న ప‌రిమితం అయి మిగ‌తా ప్రాంతాల‌కు దూరం అయ్యారు. అంతేకాదు ఆ రోజు ఆయ‌న దృష్టి కేవ‌లం రాజ‌ధాని నిర్మాణంపైనే ఉంచారు. ఆ విధంగా ఆయ‌న కొంత చెడ్డ పేరు పోగేసుకున్నా, ఇవాళ ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉంటే కొన్ని ప‌నులు అయినా పూర్తి అయి రాజ‌ధానికో రూపు వ‌చ్చేద‌ని ఇప్ప‌టికీ టీడీపీ శ్రేణుల‌తో పాటు తెలుగుదేశం అభిమానులు అంత‌ర్మ‌థ‌నం చెందుతూనే ఉంటారు.