Begin typing your search above and press return to search.
మూడేళ్ళకే ఇంత ఇదా....సినిమా చూపిస్తానంటున్న బాబు...?
By: Tupaki Desk | 13 Feb 2022 2:30 PM GMTఎక్కడ అయినా పదోన్నతికి అనుభవం ఉండాలి. కానీ రాజకీయాల్లో అవసరం లేదు, జనాలు మెచ్చితే జూనియర్ అయినా ముఖ్యమంత్రి, ప్రధాని కావచ్చు. సరిగ్గా అలాగే జగన్ కూడా ఏపీకి సీఎం అయ్యారు. ఆయన 151 సీట్లను సాధించి తిరుగులేని అధికారాలను చలాయిస్తున్నారు. ఇక్కడే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు మండుకొస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయి గట్టిగా మూడేళ్ళు మాత్రమే అయింది. నేను అయితే పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిని అని బాబు లెక్క చెబుతున్నారు.
మూడేళ్లకే ఇంతలా చెలరేగిపోతారా అని పాయింట్ లేవదీస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు. ఏపీ మీ జాగీరా అని కూడా బాబు బిగ్ క్వశ్చన్ వేస్తున్నారు. తాను సుదీర్ఘమైన అనుభవం ఉన్న నేతను అని కూడా బాబు పదే పదే చెప్పుకుంటున్నారు. నిజానికి అది బాబు చెప్పనక్కరలేదు. ఏపీ రాజకీయాలను చూసిన వారికి, తెలిసిన వారికి చంద్రబాబు కంటే సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరూ లేరని చెప్పేయగలరు. కానీ బాబు మాత్రం తన సీనియారిటీని ఈ మధ్య తరచూ గుర్తు చేసుకుంటున్నారు.
అసలు ఎందుకు ఈ అనుభవాలు, సీనియారిటీ. ఎవరు ఎక్కువ కాలం ఏపీని పాలించారు అన్న లెక్కలు వస్తున్నాయన్నదే ఒక చర్చ. అయితే ఇక్కడే ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు సీఎంగా మూడు సార్లు పనిచేసినా కూడా ఆయన ఏనాడూ దూకుడు రాజకీయాలు చేయలేదు. పైగా ఆయన ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ఎంతో ఆలోచించేవారు.
బాబు హయాంలో ప్రతిపక్ష వైసీపీని కానీ ఇతర పార్టీల నేతలను కానీ అరెస్ట్ చేయాలంటే చాలా ఆలోచించేవారు. బాబు రాజకీయ లెక్కలు వేసుకుంటూ వారి విషయంలో అలా ఉదాశీనంగానే ఉన్నారని చెప్పాలి. మాట వరసకు మాత్రం గట్టిగా హెచ్చరికలు పంపేవారు. కానీ వాస్తవంలో బాబు ఎపుడు వైసీపీ నేతలను కానీ ఇతర విపక్షాలను కానీ అరెస్ట్ చేసిన సంఘటనలు అయితే పెద్దగా లేవు.
అంతకు ముందు ఆయన ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్నా కూడా విపక్షాలను కేవలం మాటల వరకే టార్గెట్ చేసేవారు. కానీ జగన్ విషయానికి వస్తే ఆయన ఈ మూడేళ్ల కాలంలోనే టీడీపీ నేతలను వరసబెట్టి అరెస్టులు చేస్తున్నారు. అచ్చెన్నాయుడు నుంచి మొదలుపెడితే మాజీ మంత్రులు సీనియర్ నేతలు అని చూడకుండా చాలా మంది ఈ మధ్య కాలంలో అరెస్ట్ అయ్యారు.
దాంతో బాబుకు మండిపోతోందిలా ఉంది. అందుకే ఆయన జగన్ మీద గట్టిగా గర్జిస్తున్నారు. మూడేళ్ళకే ముఖ్యమంత్రిగా అంత ఆరితేరిపోయారా అని కూడా నిలదీస్తున్నారు. తాము ఏళ్ళ తరబడి పాలన చేసినా ఇలాంటివి చేయలేదు మా కంటే గొప్పా జగన్ అంటున్నారు. కానీ జగన్ స్టైల్ ఇది. ఆయన మార్క్ పాలిటిక్స్ ఇదని కూడా చెప్పుకోవాలి.
జగన్ నిర్ణయం తీసుకుంటే ఆగరు, పర్యవశానాలు ఫలితాలు ఆలోచిస్తూ కూర్చోరు. అందుకే ఆయన పాలనలో టీడీపీ వారి మీద అరెస్టులు అలవోకగా జరుగుతున్నాయి. దాంతో బాబు లాంటి సీనియర్ సైతం బిత్తరపోవాల్సి వస్తోంది. మేము నాడు చేయలేదు మేమేమి తక్కువ తిన్నామా అని బాబు ఈ రోజు ప్రశ్నించినా కూడా ఆయన నెమ్మదితనమే ఇపుడు టీడీపీ తమ్ముళ్ళకు కూడా మండుకొస్తోంది అంటున్నారు.
బాబు కూడా నాడు ఇదే రకంగా దూకుడు చూపించి ఉంటే బాగుండేది అని సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. బహుశా తమ్ముళ్ల అంతరంగం ఎరిగిన వారుగా బాబు ఇపుడు గట్టిగానే మాట్లాడుతున్నారు. మేం ప్రతీ అరెస్టుని ప్రతీ తప్పునూ లెక్క వేసి మరీ చిట్టా పద్దు మెయింటెయిన్ చేస్తున్నాం, మేము అధికారంలోకి వస్తే వైసీపీ వారి సంగతి ఏంటో ఆలోచించుకోండి అని బాబు గట్టి వార్నింగులే ఇస్తున్నారు.
మొత్తానికి బాబు తన సీనియారిటీని ఎంత చెప్పుకున్నా పొలిటికల్ ట్రెండ్ మారింది అని గ్రహించకపోవడం వల్లనే ఇలా జరుగుతోంది అని పార్టీలో అయితే చర్చ సాగుతోంది. మరి నిజంగా రేపటి రోజున టీడీపీ అధికారంలోకి వస్తే బాబు వైసీపీ వారిని ఇలాగే పెద్ద ఎత్తున అరెస్ట్ చేయించగలరా. ఇదే తీరున వరసబెట్టి నేతలకు జైలు దారి చూపిస్తారా. వెయిట్ అండ్ సీ.