Begin typing your search above and press return to search.
ఏపీలో హోల్‌సేల్ దోపిడీ.. : చంద్రబాబు హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 18 Feb 2022 3:40 PM GMTముఖ్యమంత్రి జగన్ హోల్సేల్గా రాష్ట్రాన్ని దోచుకుంటే.. మిగిలిన అధికార పార్టీ నేతలు చిల్లర దోపిడీలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు.
వాలంటీర్ల కోసం ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని మండిపడ్డారు. రూ.26 వేల కోట్ల నరేగా నిధులు వచ్చినా.. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సర్పంచ్లకు చంద్రబాబు సూచించారు.
చెత్త పన్ను. చెత్త చెత్త
చెత్త పన్నుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సర్పంచులున్న ప్రతిచోట తీర్మానాలు చేస్తే.. వైసీపీ సర్పంచులపై ఒత్తిడి పెరిగి వారి మద్దతు కూడా లభిస్తుందని చంద్రబాబు అన్నారు.
ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి టీడీపీ తరపున గెలుపొందిన సర్పంచ్లతో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. పంచాయతీ నుంచి పంచాయతీకి రోడ్లు వేయలేని జగన్ రెడ్డి.. పల్లెవెలుగు విమానాలు నడుపుతానంటున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
సర్పంచులు ఉత్సవ విగ్రహాలు
వాలంటీర్ల కోసం ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని మండిపడ్డారు. రూ.26 వేల కోట్ల నరేగా నిధులు వచ్చినా.. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత సర్పంచ్లదేనని అన్నారు.
భారతీ సిమెంట్ లాభాల కోసం సిమెంట్ ధరలు పెంచి నిర్మాణ వ్యయం పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని స్థానిక ప్రజాప్రతినిధులకు చంద్రబాబు సూచించారు.
ఢిల్లీకి వెళ్దాం.. ఫిర్యాదు చేద్దాం
ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు ఇవ్వకుంటే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలని.., ఆ దిశగా పార్టీ తరఫున కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో సర్పంచులదే కీలక పాత్ర అని..,అలాంటిది వారికి నిధులు ఇవ్వకుండా టీడీపీ హయాంలో కట్టించిన భవనాలకు రంగులేసుకోవడంతోనే వైసీపీ పాలన సరిపోతోందని ధ్వజమెత్తారు.
"ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టారు. ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారు" అని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచిన ప్రభుత్వం.. జెన్కో ఉద్యోగులకు జీతాలివ్వలేకపోతుందని విమర్శించారు. సీఎం జగన్ హోల్సేల్గా రాష్ట్రాన్ని దోచుకుంటే..మిగిలిన అధికార పార్టీ నేతలు చిల్లర దోపిడీలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
26 వేల కోట్లు వచ్చినా..
వాలంటీర్ల కోసం సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. ఏపీకి రూ.26 వేల కోట్ల నరేగా నిధులు వచ్చినా అభివృద్ధి లేదు. నరేగా పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని రుజువైంది.
చెత్తపన్నుకు వ్యతిరేకంగా పంచాయతీల్లో తీర్మానం చేయాలి. పంచాయతీలకు రావాల్సిన నిధులు ఇవ్వాలని గట్టిగా అడగాలని అన్నారు. అవాస్తవాలను వేగంగా ప్రచారం చేయటంలో జగన్ రెడ్డిని మించిన వాళ్లు లేరనేందుకు వివేకా హత్యే ఓ ఉదాహరణ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అవినాశ్.. అందుకే!
హత్యా రాజకీయాలతో రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ అవినాశ్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని వైఎస్ వివేకా అన్నందుకు కక్ష కట్టారని ఆరోపించారు. పరిటాల రవి హంతకులను ఒక్కొక్కర్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రే హత్య రాజకీయాలు చేస్తే ఎలా? అని చంద్రబాబు నిలదీశారు.