Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే.. పోల‌వ‌రం స‌మ‌స్య : చంద్ర‌బాబు ఫైర్‌

By:  Tupaki Desk   |   25 March 2022 3:31 PM GMT
జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే.. పోల‌వ‌రం స‌మ‌స్య :  చంద్ర‌బాబు ఫైర్‌
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌పైనా.. ఆయ‌న విధానాల‌పైనా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫైర‌య్యారు. ముఖ్యంగా పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో జ‌గ‌న్ అనుస‌రిస్తున్న విధానాల కార‌ణంగా.. ప్రాజెక్టు ముందుకు సాగ‌డం లేదేన్నారు. సీఎం జగన్ అసమర్థత వల్లే పోలవరానికి ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు.

పోలవరంలో మిగతా రూ.40 వేల కోట్లను రాష్ట్రం భరిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తి చేయాలని గతంలోనే కేంద్రానికి చెప్పామన్నారు. పోలవరం ఖర్చు ఆర్‌అండ్‌ఆర్‌ బాధ్యతంతా కేంద్రానిదేనని ఆయన పేర్కొన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌పై పూర్తిగా తెలియకుండానే సీఎం మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. 2023లో పోలవరం నుంచి నీళ్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

జంగారెడ్డిగూడెం మరణాలను సహజమరణాలుగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంత బాధ్యతలేని ప్రభుత్వాన్ని తాను చూడలేదన్నారు. మద్యం కల్తీ బ్రాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేవ‌లం ఆదాయం కోసమే ప్ర‌భుత్వం ఉంద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు.

ప్ర‌జ‌ల మ‌ద్యం ఆదాయంపైనే ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని.. ఈ విష‌యాన్ని సిగ్గులేకుండా సీఎం జ‌గ‌న్ చెప్పుకొంటున్నార‌ని.. విమ‌ర్శించారు. మ‌ద్యంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డితే... ప్ర‌భుత్వం పారిపోయింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ముఖ్యంగా జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న మ‌ర‌ణాల‌ను స‌హ‌జ మ‌ర‌ణాలుగా సీఎం చెప్ప‌డం.. అంత‌క‌న్నా దారుణం లేద‌ని అన్నారు.

స‌మ‌స్య ఏదైనా.. అసెంబ్లీలో చ‌ర్చించాల‌ని.. గ‌తంలో తాము అలానే చేశామ‌ని.. కానీ, జ‌గ‌న్ ప్ర‌భుత్వం కాసుల‌కు అల‌వాటు ప‌డి.. ఏ విష‌యంపైనైనా చ‌ర్చిద్దామంటే.. త‌ప్పించుకుని తిరుగుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ``టీడీపీ ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేశారు. ఎమ్మెల్సీల‌ను స‌స్పెండ్ చేశారు. ఇక‌, స‌భ‌లు ఎందుకు? స‌భ‌లు పెట్టుకుని.. జ‌గ‌న్ భ‌జ‌న చేసుకోవడానికా?`` అని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇంటా బ‌య‌టా కూడా జ‌గ‌న్ భ‌జ‌న‌లో వైసీపీ నేత‌లు పునీతులు అవుతున్నార‌ని.. కానీ.. ప్ర‌జ‌లు మాత్రం జ‌గ‌న్ పాల‌న‌ను, జ‌గ‌న్ ను కూడా చీ కొడుతున్నార‌ని విమ‌ర్శించారు. ఈ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని అన్నారు. కోర్టుల‌ను దూషించ‌డం.. న్యాయ‌మూర్తుల‌ను దూషించ‌డం.. తీర్పుల‌ను త‌ప్పుబ‌ట్ట‌డం ఈ ప్ర‌భుత్వానికి అల‌వాటుగా మారింద‌న్నారు.

కాగా, రాష్ట్రంలో టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానం లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారన్నారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారన్నారు.

బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాకుండా.. జాతీయ‌స్థాయిలోనూ పార్టీ అనేక కొత్త పుంత‌లు తొక్కి.. ఈ రోజు జాతీయ‌స్థాయి పార్టీగా ఉంద‌న్నారు. అనేక మంది ప్ర‌ధానుల నిర్ణ‌యంలోనూ..రాష్ట్ర‌ప‌తుల నిర్న‌యంలోనూ.. పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. తెలిపారు. ఈ నెల 29 నుంచి పార్టీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు.