Begin typing your search above and press return to search.
విశాఖ రాజధాని మీద తేల్చేసిన బాబు....?
By: Tupaki Desk | 5 May 2022 3:01 PM GMTవిశాఖ రాజధాని. డెబ్బై ఏళ్ళ నాటి ఇష్యూ. నాడు ప్రత్యేక ఆంధ్రా ఏర్పడితే తొలి ఆప్షన్ గా విశాఖ అనుకున్నారు. అయితే కర్నూల్ అయింది. అయినా సరే నాటికే సౌకర్యవంతంగా ఉన్న విశాఖను రాజధానిని చేయాలని ఒక ఓటు తేడాతో నాటి కర్నూల్ శాసససభలో తీర్మానం గెలిచింది. అన్నీ అనుకూలిస్తే నాడే విశాఖ రాజధాని కావాల్సింది.
ట్విస్ట్ ఏంటి ఏంటి అంటే విశాల ఆంధ్రా పేరిట నాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసుకుని హైదరాబాద్ ని రాజధాని చేసుకోవడంతో విశాఖకు ఆ చాన్స్ పోయింది. ఇక విభజన తరువాత కూడా ఫస్ట్ చాన్స్ విశాఖ అనే అన్నారు. కానీ అమరావతి రాజధానిగా చివరికి డిసైడ్ చేశారు.
ఇక వైసీపీ వచ్చాక మూడు రాజధానుల పేరిట చట్టం చేశారు, తరువాత దాన్ని రద్దు చేసుకున్నారు. అయితే రెండేళ్ళ పాటు రాజధానిగా విశాఖ అన్న అంశం నలిగింది. అలా లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. విశాఖ వాసులకు రాజధాని సెంటిమెంట్ ఉందా లేదా అంటే పూర్తిగా లేదు అని చెప్పలేరు అలాగని దాని కోసమే పోరు చేస్తారు అని కూడా అనలేరు.
అంటే ఒక విధంగా వస్తే మంచిదే అన్న భావన. రాకపోయినా ఓకే అనే నిదానత్వం విశాఖ వాసులది. ఈ విషయం వైసీపీ కంటే కూడా టీడీపీకే ఎక్కువగా తెలుసు. అందుకే తాజాగా విశాఖ టూర్ లో చంద్రబాబు డైరెక్ట్ గా ఒక ప్రశ్న ప్రజలనే అడిగారు. మీకు విశాఖ రాజధాని కావాలా లేక అభివృద్ధి కావాలా అని. విశాఖ అభివృద్ధికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నాను అని బాబు చెప్పుకున్నారు.
అమరావతిని రాజధానిగా చేసినా విశాఖను ఆర్ధిక, పర్యాటక ఫార్మా రాజధానిగా చేసి చూపిస్తాను అని బాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక విశాఖ అభివృద్ధికి ఎవరైనా అడ్డుపడితే తాను వారికే అడ్డంగా నిలబడి మరీ మెగా సిటీని దేశంలో నంబర్ వన్ చేస్తాను అని కూడా బాబు చెప్పారు.
అసలు ఇదంతా ఎందుకంటే ఈ మధ్యనే జగన్ విశాఖ వచ్చినపుడు విశాఖను రాజధాని చేస్తామంటే టీడీపీ అడ్డుపడింది అని ఆరోపించారు. ఉత్తరంధ్రా ఆత్మగౌరవం అన్న మాటలను కూడా వాడి ఆయన సెంటిమెంట్ రంగరించారు. ఈ నేపధ్యంలో బాబు దానికి గట్టి జవాబును తన విశాఖ టూర్ లోనే ఇచ్చారు. రాజధాని ఎందుకు అభివృద్ధి చేయాలి కానీ అంటూ వైసీపీని దెప్పిపొడిచారు. మొత్తానికి బాబు విశాఖ రాజధాని విషయంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. మరి జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలి.