Begin typing your search above and press return to search.

కొత్త ముఖాల‌పై చంద్ర‌బాబు కుస్తీ.. ఏం చేయాలి?

By:  Tupaki Desk   |   27 Feb 2022 11:30 PM GMT
కొత్త ముఖాల‌పై చంద్ర‌బాబు కుస్తీ.. ఏం చేయాలి?
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్కువ మంది కొత్త ముఖాల‌కు టికెట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ విష‌యం పార్టీలో చ‌ర్చ గా సాగుతోంది. ఇది మంచిదే.. ఎప్ప‌టి నుంచో యువ‌త‌కు టికెట్‌లు ఇస్తామ‌ని.. కొత్త‌ర‌క్తంతో పార్టీని నింపుతామ‌ని.. చంద్ర‌బాబు చెబుతున్నారు.

అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌ల స‌మయం రాగానే మ‌ళ్లీ వార‌సుల‌కు.. పాత‌వారికే టికెట్లు  ఇచ్చేస్తు న్నారు. కానీ, ఈ సారికి మాత్రం కొత్త ముఖాల‌కు అవకాశం క‌ల్పించాల‌ని.. చంద్ర‌బాబు భావిస్తున్నారు. దీనికి మ‌రో కార‌ణం కూడా ఉంది. అధికార వైసీపీ ఎలాగూ ఈ సారి కూడా కొత్త‌వారికి ఛాన్స్ ఇస్తుంది. సో.. తాము కూడా ఇదే వ్యూహం అనుస‌రించాల‌ని... చంద్ర‌బాబు భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో రాజ‌కీయంగా పెద్ద‌గా ప‌రిచ‌యంలేని కుటుంబాల నుంచి వ‌చ్చిన వారికి  టికెట్లు ఇవ్వ‌నున్న‌ట్టు టీడీపీలో ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయితే.. ఇలా చేయ‌డం వ‌ల్ల పార్టీకి మేలు క‌న్నా కీడు ఎక్కువ‌గా జ‌రుగుతుందని సీనియ‌ర్లు ముఖం వాల్చేస్తున్నారు. ``ఇలా చేసి ఏం చేయాల‌ని అనుకుంటున్నారు? గ‌త అనుభ‌వాల‌ను ప‌ట్టించుకోరా?`` అని వారు చంద్ర‌బాబును నిల‌దీస్తున్న‌ట్టు స‌మాచారం.

ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అనేక ప్ర‌యోగాలు చేశారు. కొత్త‌వారికి టికెట్లు ఇచ్చారు. అయితే.. వీరంతా వార‌సులే. బాగా డ‌బ్బులు కూడా ఖ‌ర్చు పెట్టుకున్నారు.

అయిన‌ప్ప‌టికీ..ప్ర‌జ‌లను మెప్పించ‌లేక .. ఈ వార‌సులు పార్టీలో ఓడిపోయారు.  ఇప్పుడు వీరంతా మ‌రోసారి టికెట్లు ఆశిస్తు న్నారు. వీరికి ఇవ్వ‌కుండా.. కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా.. పార్టీలో నూత‌నోత్తేజానికి చంద్ర‌బాబు శ్రీకారం చుట్టాల‌ని భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న నేరుగా... యువ‌త‌కు ప్రాధాన్యం ఇ చ్చే క్ర‌మంలో కొత్త ముఖాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చెబుతున్నారు. అయితే.. దీనివ‌ల్ల ఆర్తికంగా బ‌లంగా లేనివారికి టికెట్లు ఇచ్చి ఏం సాధిస్తారు? అనేది సీనియ‌ర్ నేత‌ల ప్ర‌ధాన సూటి ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో.. 10 నుంచి 20 మంది కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌నున్నారు.

మిగిలిన స్థానాల‌ను పాత‌వారికే టికెట్లు ఇవ్వ‌నున్నారు. దీనిని బ‌ట్టి వారంతా ఆర్థికంగా.. బ‌లంగా ఉన్నారు. ఇది.. టీడీపీ అభ్య‌ర్థుల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుందనేది సీనియ‌ర్ల మాట‌. ఈ నేప‌థ్యంలో టీడీపీ నుంచి కూడా ఆర్థికంగా బ‌ల‌మైన వారికి అవ‌కాశం ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఉంది.

దీనిని ప‌క్క‌న పెట్టి.. నేత‌లు ప‌నిచేయ‌డం లేద‌నే కార‌ణంతోనో..లేక మ‌రో కార‌ణంతో.. ఇప్పుడు నిర్ణ‌యాలు మార్చుకుంటే క‌ష్ట‌మ‌ని..  పార్టీకి అంతిమంగా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. సీనియ‌ర్లు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. దీంతో కొత్త ముఖాల కు టికెట్ల‌పై చంద్ర‌బాబు కుస్తీ ప‌డుతున్నార‌ట‌!! చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి.