Begin typing your search above and press return to search.
ఆయన జీరో కాదు హీరో ! ఓవర్ టు సీబీఎన్
By: Tupaki Desk | 20 April 2022 2:35 PM GMTజీరో ఎవరు హీరో ఎవరు అన్న పాయింట్ దగ్గర చర్చకు తావిస్తూ మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీ లో 44 ఏళ్లు అలుపెరుగని నాయకుడిగా పనిచేసి పేరు తెచ్చుకున్న ఆయనను జీరో అనడం భావ్యం కాదని కొందరు ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. ఆ రోజు హైద్రాబాద్ నగరి అభివృద్ధికి కృషి చేసినా తరువాత కాలంలో అమరావతి అభివృద్ధికి కృషి చేసినా అదంతా ఆయన దార్శినికతకు సంకేతం.
ఈ తరుణంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆఫీసుకు వచ్చారు. తనను చంద్రబాబు ఏ విధంగా ఆదుకున్నారో ఎంతో భావోద్వేగంతో చెప్పారు. ఎన్టీఆర్ భవన్ కు వచ్చి, పెద్దాయనకు శుభాకాంక్షలు చెప్పి వెళ్లారు. తనకు ఓ ఇల్లు కట్టించి ఇచ్చారని, కష్టంలో ఉన్నానంటే ఆర్థిక సాయం చేశారని, తన బిడ్డకు ఉద్యోగం వేయించారని చెబుతూ.. చంద్రబాబు ఓ సామాన్య కార్యకర్త విషయమై ఏ విధంగా అండగా ఉంటారో వివరించారు.
అదేవిధంగా ఎంతో మంది కార్యకర్తలు ఇవాళ పార్టీ ఆఫీసుకు చేరుకుని ఆయనకు జ్ఞాపికలు ఇచ్చి, ఆయన ఆశీర్వాదాలు అందుకుని వెళ్లారు. ఇవాళ ఆయన పదవిలో లేరు. ఇవాళ ఆయనకు పెద్దగా గుర్తింపు కూడా లేదు. అయినా కూడా ఆయన్ను అభిమానించే యువత ఇప్పటికీ ప్రాంతాలకతీతంగా ఉన్నారు. కనుకనే ఆయన జీరో కాదు హీరో..!
బర్త్ డే బోయ్ చంద్రబాబును ఉద్దేశించి ఇవాళ చాలా మంది సోషల్ మీడియాలో మంచి భాష ఉపయోగిస్తూ రాస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయన బాగా పనిచేశారని చెబుతున్నారు. యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తనను ఆయన ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఈ రోజు మరోసారి కార్యకర్తలకు వివరించారు.
తండ్రి తరువాత తండ్రి అన్నంత స్థాయిలో తనను అధినేత ఎన్నడూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తారని, పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై ఎప్పుడు మాట్లాడినా ఆయన నుంచి మంచి అభినందనలే తనకు వస్తాయని, ముఖ్యంగా తాను చెప్పిన సబ్జెక్ట్ లో మంచి అంశాలను లేవనెత్తి ప్రసంగిస్తే ఆయన ఎంతో సంతోషిస్తారని యువ ఎంపీ రాము చెబుతున్నారు. ఆయనొక్కరే కాదు చాలా మంది యువ నాయకులు చంద్రబాబు నాయకత్వంలో మరింతగా ఎదిగేందుకు కృషి చేస్తామని అన్నారు ఇవాళ.
తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా, సంబంధిత పోరాటాలకు ప్రతినిధిగా ఆయన చరిత్రలో నిలిచి ఉంటారని కితాబిస్తున్నారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ భవన్లో జరిగిన వేడుకల్లో తెలుగుప్రజల ఆశ, ఆకాంక్ష తెలుగుజాతి భరోసా నారా చంద్రబాబు నాయుడు అని, ఆయన ఒక వ్యక్తి కాదు మహాశక్తి అని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గుండ లక్ష్మీదేవి వ్యాఖ్యానించారు.
ఇదే సందర్భంలో పలువురు కీలక నాయకులు అడ్మిన్ పరంగా చంద్రబాబు ఏ విధంగా ఉంటారో, సాంకేతికతకు సంబంధించిన ప్రగతి ఫలాలను ఏ విధంగా అందుకుని పనిచేస్తారో కూడా వివరించి ఆయన జీరో కాదు హీరో అని అభిప్రాయపడుతున్నారు.