Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డే బోయ్ : దుర్గ‌మ్మ తోడుగా స‌రికొత్త పోరు ! జ‌య‌ము చంద్ర‌న్న

By:  Tupaki Desk   |   20 April 2022 3:30 PM GMT
బ‌ర్త్ డే బోయ్ : దుర్గ‌మ్మ తోడుగా స‌రికొత్త పోరు ! జ‌య‌ము చంద్ర‌న్న
X
లీడ‌ర్ అంటే విజ‌న్ ఉండాలి అని అంటే స‌రిపోదు. అందుకు త‌గ్గ మ‌నిషి కూడా ఎదురుగా ఉండాలి. ఇన్నేళ్ల ప్ర‌యాణంలో చంద్ర‌బాబుకు ప్ర‌త్యామ్నాయ స్థాయిలో తెలుగుదేశంలో మ‌రో లీడ‌ర్ లేరు.. వినేందుకు ఆశ్చ‌ర్య‌మే క‌దా! అందుకే ఆయ‌న వ‌య‌స్సును కూడా లెక్క చేయ‌కుండా ఇంద్ర‌కీలాద్రి అమ్మ‌వారి ఆశీస్సుల‌తో వైసీపీ పై న‌యా పోరుకు సిద్ధం అవుతున్నారు.

ఈ పాటి ఆలోచ‌న క్షేత్ర స్థాయిలో ఉన్న నాయ‌కులు కూడా చేయొచ్చు. కార్య‌క‌ర్త‌ల‌ను వెంట బెట్టుకుని ప్రజా క్షేత్రంలో పాలక పార్టీ చేస్తున్న త‌ప్పిదాలు వివ‌రించ‌వ‌చ్చు.కానీ అధినేత చెబితే, మీడియా ఎటెన్ష‌న్ ఉంటేనే క‌దులుతారు. కానీ చంద్ర‌బాబు మాత్రం ఇప్ప‌టికీ పార్టీ కోసం 18 గంట‌ల పాటు రోజుకు ప‌నిచేసేందుకు, ప‌రిశ్ర‌మించేందుకు కూడా సిద్ధ‌మేన‌ని అంటారు. ద‌టీజ్ చంద్ర‌బాబు.

విప‌క్షం క‌న్నా స్వ‌ప‌క్షం ఎన్న‌డూ బ‌లంగానే ఉంటుంది. బ‌లహీన‌మ‌యిన పార్టీ అయితే టీడీపీ కాదు కానీ బ‌ల‌హీనం అయిన నాయ‌క‌త్వం అయితే అక్కడ‌క్క‌డా ఉంది. దానిని స‌రిదిద్దేందుకు చంద్ర‌బాబు నిరంత‌రం దృష్టి నిలిపి, క్షేత్ర స్థాయిలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తూనే ఉంటారు. అస‌లు వైసీపీని స‌మ‌ర్థ స్థాయిలో లోకేశ్ క‌న్నా చంద్ర‌బాబే బాగా ఢీ కొంటున్నారు అన్న‌ది నిజం. నాన్న చంద్ర‌బాబు త‌ర‌ఫున, బాధితుల త‌ర‌ఫున ఈ పాటికే ప్ర‌జా పోరును తీవ్ర‌త‌రం చేసి ఉంటే లోకేశ్ ఈ పాటికే గొప్ప నాయ‌కుడిగా ఎదిగి ఉండేవారు. కానీ ఆయ‌న క‌న్నా వేగంగా ఇవాళ చంద్ర‌బాబే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

లోకేశ్ క‌న్నా పార్టీని స‌క్ర‌మ రీతిలో న‌డపాల‌న్నా న‌డిపించి ఫ‌లితాలు అందుకోవాల‌న్నా ఇప్ప‌టికీ చంద్ర‌బాబే దిక్కు. అందుకే అంతా ఆయ‌న వైపే ఉంటారు. సాగునీటి ప్రాజెక్టుల‌పై మాట్లాడాలి అన్నా, ఐటీ రంగం గురించి చెప్పాల‌న్నా ఇవాళ చంద్ర‌బాబును దాటిన నాయ‌కుడు ఒక్క‌రంటే ఒక్క‌రు టీడీపీలో లేరు.

ఓ విధంగా చంద్ర‌బాబుకు ప్ర‌త్యామ్నాయం లేదు. అందుకే లోకేశ్ క‌న్నా చంద్ర‌బాబు అంటేనే ఎక్కువ మంది అభిమానిస్తారు. ఆయ‌న ఆదేశాల‌కు అనుగుణంగా తెలుగుదేశం ఉన్న‌తికి శ‌క్తి వంచ‌న లేకుండా ప‌ని చేసేందుకు, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు వీలున్నంత మేర కొంద‌రు క్షేత్ర స్థాయిలో ఉన్నారు. వారే ఆ పార్టీ ఎదుగుద‌ల‌కు కార‌కులు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబును దాటించి ఏ నాయ‌కులూ లేరు అని చెప్పేది.. వ్యాఖ్యానించేది అందుకే !

పుట్టిన రోజు పండుగ‌రోజు అని చెప్పుకుంటూ హాయిగా ఉండే నేత‌ల‌కు భిన్నంగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఏడు ప‌దులు దాటిన వ‌య‌స్సులోనూ హుషారుగానే ఉంటూ, పార్టీ ప్ర‌గ‌తికి కృషి చేస్తున్నారు. ఇదొక విశేషం అయితే, పాల‌క ప‌క్షం ఎంత బ‌లంగా ఉన్నా ఒక్క రోజు కూడా ఒక్క అడుగు కూడా వెన‌క్కు వేయ‌కుండా పోరాటం చేయ‌డం మ‌రో విశేషం. తెలుగుదేశం పార్టీ లో జ‌వం, జీవం నింపేందుకు నిరంత‌రం శ్ర‌మించే అధినేత పుట్టిన్రోజు ఈ రోజు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాకుళం మొద‌లుకుని అనంత‌పురం వ‌ర‌కూ ఆయ‌న జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రిగాయి. పార్టీ అభ్యున్న‌తి కోసం, రాష్ట్రంలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల కోసం ఆ రోజు నుంచి ఈ రోజు అలుపెరుగ‌క ప‌నిచేసిన ఏకైన నేత చంద్ర‌బాబే అని టీడీపీ శ్రేణులు కితాబిస్తున్నాయి.

అంత పెద్ద వ‌య‌స్సులోనూ ఆయ‌న ప‌రుగులు తీస్తూ త‌మ‌ను కూడా అదేవిధంగా వేగం వేగంగా ప‌ని చేసేలా, ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లు చేసేలా ప్రోత్స‌హించ‌డం ఎంతైనా ఆయ‌న గొప్ప‌త‌నం అని కితాబిస్తున్నారు.ఇక ఈ రోజు ఆయ‌నేం చేశారంటే విజ‌య‌వాడ అమ్మ‌వారిని ద‌ర్శించుకుని, దీవెన‌లు అందుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపేందుకు, తెలుగు జాతికి పూర్వ వైభ‌వం తెచ్చేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని కూడా మీడియా ఎదుట చెప్పారు.