Begin typing your search above and press return to search.
బాబు వస్తే పధకాలు రద్దు... కౌంటర్ అటాక్...?
By: Tupaki Desk | 22 April 2022 2:24 PM GMTఏపీలో రాజకీయ యుద్ధానికి అటూ ఇటూ స్ట్రాంగ్ స్లోగన్స్ రెడీ అవుతున్నాయి. ఏపీ అప్పుల కుప్పగా మారిందని టీడీపీ దాని అనుకూల మీడియా అంటున్నాయి. అదే టైమ్ లో ఏపీ శ్రీలంక అవుతుంది అని కూడా పొలికలు తెస్తున్నారు. ఏపీలో ఉచితాలు అనుచితమని కూడా ఒక సెక్షన్ మీడియాలో రాతలతో పాటు టీవీలలో డిబేట్లూ ఉంటున్నాయి.
బహుశా దీని మీద సీఎం జగన్ ఆలోచించి మరీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారా అన్న చర్చ ఉంది. నేను ఇన్నేసి పధకాలు ఇస్తున్నది ఏవరి కోసం. పేదల కోసం, నా ఎస్సీస్, నా ఎస్టీస్, నా బీసీస్, నా మైనారిటీస్, నా పేదల కోసం నేను పధకాలు ఇస్తూంటే వద్దు అంటున్నారు అని జగన్ మండిపడుతున్నారు.
ఏపీలో పధకాలు ఆపేయాలని ఒక వర్గం మీడియా టీడీపీ మాటలను చెప్పకనే చెబుతోంది. దీని అర్ధం ఏంటి అంటే చంద్రబాబు వస్తే పధకాలు ఉండవనే అని ఆయన విడమరచి చెప్పారు. ఒంగోలు మీటింగులో జగన్ విపక్షాల మీద ఫైర్ అయ్యారు. అదే టైమ్ లో బాబు వస్తే పధకాలు కట్ అంటున్నారు.
ఒక విధంగా చూస్తే వివిధ పధకాల ద్వారా ఏపీలో లబ్ది పొందుతున్న కోట్లాదిమందిని టీడీపీ మీదకు నేరుగా ఉసిగొల్పుతున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. చిత్రమేంటి అంటే ఇప్పటిదాకా టీడీపీ అయితే తన నోటితో పధకాలు వద్దు అనలేదు. ఆ మాటకు వస్తే మేమే సామాజిక పెన్షన్ రెండు వేలు చేశామని చెప్పుకుంటోంది. తాము అన్న క్యాంటీన్లు పెట్టామని, నిరుద్యోగ భృతిని కూడా ఇచ్చామని, తమ పధకాలు చాలా వైసీపీ ఆపేసింది అని కూడా ఆరోపిస్తోంది.
దీనిని బట్టి చూస్తే టీడీపీ సంక్షేమ పధకాలు ఆపుతుందని ఎవరూ అనుకోరు. అయితే వైసీపీ పధకాలు కంటిన్యూ చేస్తుందని కూడా సగటు ఓటరు కూడా అనుకోడు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకుని జగన్ ఒంగోలు సభలో తన స్ట్రాంగ్ స్లోగన్ ని బయటకు తీశారు. పధకాలు కొనసాగించమంటారా ఆపేయమంటారా అంటూ జగన్ అడుగుతున్నారు. ఆ విధంగా లబ్దిదారులను తమ వైపునకు తిప్పుకునే మాస్టర్ ప్లాన్ కి ఆయన తెర తీశారు అనుకోవాలి.
మరి జగన్ అందిస్తున్న పధకాలను అందుకున్న వారు నిజంగా వైసీపీ వైపే ఉంటారా. లేక రేపటి రోజున టీడీపీ తెచ్చే కొత్త పధకాలకు ఆకర్షితులు అవుతారా. అసలు టీడీపీ ఈ పధకాల విషయంలో దుబారా అని గట్టిగా చెప్పగలుతుందా. జనాలను కన్విన్స్ చేయగలుస్తుందా. ఇవన్నీ ప్రశ్నలే. జవాబులకు రాబోయే రోజుల్లో రాజకీయ తెర మీద చూడాలి. ఒక్కటి మాత్రం నిజం. తన పధకాలకు మంగళం పాడే టీడీపీ కావాలో, లేక బటన్ నొక్కి డబ్బులు ఇచ్చే తాను కావాలో తేల్చుకోవాలని జనాలను జగన్ కోరుతూ ఎన్నికలకు వెళ్తారు అన్నది క్లారిటీగా అర్ధమైపోతోంది. చూడాలి మరి జనాల తీర్పు ఏమిటో.