Begin typing your search above and press return to search.
జగన్ తో కాదుట : చంద్రబాబు భయమల్లా అదేనట...?
By: Tupaki Desk | 1 Jun 2022 3:30 AM GMTనాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం నిండా పండించుకున్న నేత చంద్రబాబునాయుడు. ఈ రోజుకీ ఆయన ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా ఉంటారు. ఆయన ఇదే తీరున మరో పదేళ్ల పాటు దూకుడు రాజకీయం చేయగలరు అని అంతా అంటారు. ఈ మధ్య ప్రతీ జిల్లాలకు వెళ్ళి బాదుడే బాదుడు కార్యక్రమాల్లో ఉత్సహంగా పాల్గొన్న చంద్రబాబు మహానాడు లో తన మాటలనే బాంబులుగా చేసి ప్రత్యర్ధుల మీద ప్రయోగించారు. ఎక్కడా తగ్గేదేలే అని కూడా బిగ్ సౌండ్ చేశారు.
మహానాడు అదిరిపోయింది, జనాలు లక్షల్లో కదిలివచ్చి టీడీపీని దీవించారు. దాంతో బాబులో ధీమా అయితే పెరిగింది. అయితే పార్టీని ఎలా గాడిలో పెట్టడం అన్నదే ఆయనకు ఇపుడు అతి పెద్ద సమస్యగా ఉంది. ఎక్కడ చూసినా నిస్తేజంగా ఉన్న నాయకులు. మరో వైపు వర్గపోరు, ఇంకో వైపు అవకాశాలు ఏమైనా తమకే రావాలన్న స్వార్ధ రాజకీయాలు దీంతోనే చంద్రబాబు పార్టీ నేతలకు గట్టి హెచ్చరికలు చేస్తున్నారు.
బయట జనాలు కసి మీద ఉన్నారు, వైసీపీని ఎంతవేగంగా దించేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు, మహనాడులో అది ప్రస్ఫుటంగా కనిపించింది. ఇక కార్యకర్తలు చూస్తే టీడీపీ మళ్లీ గెలవాలి అని గట్టిగా కోరుతుకుంటున్నారు. ఇన్ని అనుకూలతల మధ్య నాయకులు ఇంకా అలాగే ఉంటే కుదిరే పరిస్థితే కాదు అంటూ బాబు చెబుతున్నారు.
మీరు మారాలి, వర్గ పోరుకు ఇకనైనా స్వస్తిపలకాలి అని కూడా సూచిస్తున్నారు. పార్టీలో ఎవరు గ్రూపులు కట్టినా అసలు సహించేది లేదని కూడా బాబు హెచ్చరించారు. వర్గ పోరుకు దారి తీసే పరిస్థితులు ఎవరు కల్పించినా సహించే ప్రసక్తే లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు రెండేళ్ళు మాత్రమే గడువు ఉందని, పార్టీ అంతా కలసి కట్టుగా పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని బాబు హితవు చెబుతున్నారు.
వర్గ పోరుతో పార్టీకి తీరని నష్టం కలుగుతుందని కూడా ఆయన పేర్కొంటున్నారు. తాను కూడా గతంలో మాదిరిగా చూస్తూ ఊరుకునేది లేదని, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కఠిన చర్యలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చేసారు. మొత్తానికి చూస్తే చంద్రబాబుకు జనాల మీద డౌట్ లేదు, పార్టీ క్యాడర్ మీద అంతకంటే డౌట్ లేదు, కానీ పార్టీలో సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన కొందరు నేతలు కడుతున్న గ్రూపులే భయాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు.
నిజానికి జగన్ ప్రత్యర్ధి కానే కాదు వర్గ పోరే టీడీపీకి ఇబ్బంది అని కూడా టీడీపీ పెద్దలు అంచనా వేస్తున్నారుట. అంటే పసుపు పార్టీ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా తమ మాటే చెల్లాలి అని ఎదుటి వారి అవకాశాలను దెబ్బకొట్టాలని చూస్తే చివరికి అది పార్టీ నష్టానికి దారితీస్తుంది. అందుకే పదే పదే గ్రూపులు వద్దు అంటున్నారు. మరి యాక్షన్ లోకి దిగుతాను అంటున్న బాబు ఏం చేస్తారో చూడాలి.