Begin typing your search above and press return to search.
క్విట్ ఫ్రమ్ పాలిటిక్స్ : జగన్ మీద కొత్త అస్త్రం...?
By: Tupaki Desk | 11 Jun 2022 12:30 AM GMTరాజకీయాల్లో ట్రెడిషనల్ స్పీచ్ లకు కాలం చెల్లిపోయింది. పవర్ ఫుల్ పంచ్ డైలాగులతోనే ఇపుడు కధ సాగుతోంది. మాస్ ని అట్రాక్ట్ చేయాలంటే ఇలాగే మాట్లాడాలని అంతా డిసైడ్ అయిపోయారు. ఇక ఎర్లీ సెవెంటీస్ నుంచి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు కూడా తన భాష తీరు మొత్తం మార్చేస్తున్నారు. ఆయన జగన్ మీద ఘాటుగా మాట్లాడుతున్నారు. జగన్ మీద ఒక విధంగా చెప్పాలీ అని అంటే నిప్పులు చెరుగుతున్నారు.
మరి రోజూ ఒకటే రొటీన్ గా మాట్లాడితే విలువ ఏముంది అనుకున్నారేమో తెలియదు కానీ కొత్త పదాలు కనిపెట్టి మరీ జగన్ మీద బాణాలు విసురుతున్నారు. ఇప్పటిదాకా క్విట్ జగన్ సేవ్ ఏపీ అంటూ నినదించిన అధినాయకుడు చంద్రబాబు ఇపుడు ఏకంగా క్విట్ ఫ్రమ్ పాలిటిక్స్ అంటూ జగన్ కి గట్టి వార్నింగే ఇచ్చేశారు.
రాజకీయాలలో ఉండేందుకు జగన్ అర్హుడు కాదు అని ఆయన మండిపడ్డారు. జగన్ లాంటి వారు నియంతలుగా మారితే అంతా చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. రాజ్యాంగాన్ని మంటగలుపుతూ అరాచక పాలన చేస్తూ ఏపీని వల్లకాడుగా జగన్ మార్చేశారు అంటూ పవర్ ఫుల్ డైలాగులనే బాబు వాడేశారు. జగన్ కి రాష్ట్రాన్ని రాసిచ్చేసి ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదని గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
ఏపీలో ప్రత్యర్ధులు నోరెత్తితే కేసులు పెట్టడమే కాకుండా అడ్డు వచ్చిన వారిని హతమార్చడమేనా మీ రాజకీయ నీతి అని కూడా ప్రశ్నించారు. జగన్ వంటి నేరస్తుడి పాలనలో ఏపీ ఉండడం దారుణం అని బాబు అనడమూ షాకింగ్ స్టేట్మెంట్ గానే చూడాలి. జగన్ ఒక్క చాన్స్ అంటూ వచ్చారు, మూడేళ్ళలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. ఇక వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలు మిస్టర్ జగన్ అంటూ గర్జించారు. 175 సీట్లు రావాలని కలలు కంటున్నారు. అసలు ఆ ఎన్నికల తరువాత వైసీపీ సంగతి ఏమవుతుందో చూసుకోవాలని కూడా హెచ్చరించారు.
మొత్తానికి జగన్ కి మద్దతుగా నిలుస్తున్న పోలీసులను కూడా చట్టం ముందు నిలబెట్టి కఠినమైన తీరున శిక్షిస్తామని స్పష్టం చేశారు. జగన్ వంటి వారు రాజకీయాల్లోకి రాకుండా చూడాలని ప్రజలకు కూడా అప్పీల్ చేశారు. ఇదే తమ నినాదం కూడా అవుతుందని బాబు చెప్పడం విశేషం. అంటే జగన్ రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అని టీడీపీ అధినాయకుడు అంటున్నారు అన్న మాట. మరి జగన్ దీనికి ఎలా రియాక్ట్ అవుతారో.