Begin typing your search above and press return to search.
బాబు చెబుతున్నదేంటి : రింగ్ వెనక ఏముందీ...?
By: Tupaki Desk | 7 July 2022 2:01 PM GMTకింగ్ ని చేసే రింగ్ ఒకటి ఉంది. దాన్ని మా చంద్రన్న ఎడమ చేతి వేలికి పెట్టేసుకున్నారు. ఇక ఏ బెంగా అక్కరలేదు, దర్జాగా అధికారంలోకి వచ్చేస్తామని తమ్ముళ్ళు తెగ మురుస్తున్న వేళ తన వేలికి ఉన్న రింగ్ వెనక గుట్టుని బాబు విప్పేశారు. అది హెల్త్ రింగ్ మాత్రమే అని చెప్పి ఆయన ఇంటరెస్ట్ కి తెర దించేశారు. తాను పెట్టుకున్నది తన హెల్త్ ని ఎప్పటికపుడు చెక్ చేసుకోవడానికే తప్ప మరోటి కాదని ఆయన తాపీగా తేల్చేశారు.
తనకు ఏ జ్యోతీష్కుడు రింగ్ పెట్టుకోమని చెప్పలేదని ఆయన మ్యాటర్ మొత్తం చెప్పుకొచ్చారు. అయినా సరే అనుమానాలు డౌట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. చంద్రబాబుని కింగ్ ని చేసే రింగ్ అని అంటున్న వారూ ఉన్నారు. విషయానికి వస్తే జ్యోస్యాలు చెప్పేవారు కూడా ఎడమ చేతి చూపుడు వేలు పవర్ ఫుల్ అని అక్కడ రింగ్ పెడితే ఎవరైనా కింగ్ అవడమే తరువాయి అని చెబుతారని విపరీతంగా ప్రచారం అయితే సాగుతోంది.
కానీ చంద్రబాబు అయితే తాను పెట్టుకున్న రింగ్ లో చిప్ ఉంటుందని, అది తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు వైద్యులకు అది తెలియచేస్తుందని అంటున్నారు. అలా బాబు చెప్పినా కూడా ఇంకా నమ్మని వారూ ఉన్నారు. రాజకీయ నాయకులు అంటే అన్ని రకాల సెంటిమెంట్లూ నమ్ముతారు. అయితే దానికి చంద్రబాబు మాత్రం వ్యతిరేకం అనే చెప్పాలి.
పైగా ఆడంబరాలు ఆభరణాల మీద బాబుకు మోజు మొదటి నుంచి లేదు. నా చేతికి వాచీ అయినా ఉందా తమ్ముళ్లూ అని బాబు అనేక సందర్భాలలో సభలలో చెబుతూ ఉన్న సంగతి విధితమే. అయితే ఇపుడు సడెన్ గా ఈ రింగ్ తో బాబు ప్రత్యక్షం కావడం మాత్రం తెగ వైరల్ అవుతోంది. బాబు రింగ్ సీక్రెట్ చెప్పిన తరువాత కూడా జనాలు వదలడంలేదు.
ఇక చూస్తే వచ్చే ఎన్నికలు టీడీపీకి నిజంగా సవాల్ లాంటివి. దాని కోసం బాబు ఓడిన తరువాత డే వన్ నుంచి జనంలోకి వస్తూనే ఉన్నారు. పోరాటం చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఇపుడు సెంటిమెంట్లు కూడా జత చేసి మరీ బాబు దూకుడు పెంచుతున్నారని కూడా అన్న వారు ఉన్నారు. అయితే బాబు రింగ్ పెట్టుకున్నారని, జోస్యాలు నమ్ముతున్నారని ప్రచారం జరిగితే అది ఇబ్బంది అని భావించి ఆయన ఇలా చెప్పారా అన్న మాట చెప్పుకునే వారూ ఉన్నారు.
అయితే బాబు హెల్త్ చెకప్ కోసం రింగ్ అని చెప్పడం మీద కూడా గట్టిగానే చర్చ సాగుతోంది. ఏడు పదులు దాటినా బాబులో హుషార్ తగ్గలేదు. ఆయన పాతికేళ్ల యువకుడి మాదిరిగా ఉంటారు. అలాంటి బాబు హెల్త్ చెకప్ ని ఎప్పటికపుడు వైద్యులు చిప్ పెట్టి మరీ పరీక్షించాల్సిన అవసరం ఏముంది అన్న చర్చ కూడా సాగుతోంది. మరి ఇది కూడా కొంత ఇబ్బందికరమైన ప్రచారంగా మారితే మాత్రం ఇంకా వివరణ టీడీపీ నుంచి ఇవ్వక తప్పదేమో.