Begin typing your search above and press return to search.
టికెట్లు ఇచ్చేస్తున్న బాబు : జనసేన తో పొత్తు మాటేంటి...?
By: Tupaki Desk | 10 July 2022 3:09 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు వరసబెట్టి టికెట్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఆయన రాయలసీమలో వరస పర్యటనలు చేస్తూ అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. నిజానికి చంద్రబాబు నైజానికి ఇది పూర్తిగా విరుద్ధమైన వ్యవహారంగానే చూడాలి. చంద్రబాబు ప్రతీసారీ టికెట్లు ప్రకటించేది ఎపుడూ నామినేషన్లకు చివరి కొద్ది గంటలలో మాత్రమే. అంతవరకూ కూడికలు తీసివేతలు వడబోతలు ఇలా చాలా రకాలుగా కసరత్తు చేస్తూ ఉంటారు.
అలాంటి బాబు ఈసారి మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఒక విధంగా గతంలో చూడని బాబుని అందరూ చూస్తున్నారు. ఆ మధ్య కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్ళినపుడు చంద్రబాబు సుబ్బారెడ్డిని డోన్ అభ్యర్ధిగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా సీనియర్ నేత కేయీ క్రిష్ణమూర్తి కుటుంబానికి ఈ పరిణామం మింగుడుపడకపోయినా బాబు చేయాల్సింది చేశారు. అలా రెండేళ్ళ ముందు నుంచే పనిచేసుకోమన్నారు.
ఇపుడు మరో తడవ ఆయన సీమ జిల్లాలలో పర్యటించారు. ఈ సందర్భంగా రాజంపేట లోక్ సభ టికెట్ ని గంటా నరహరికి ఇస్తున్నట్లుగా డిక్లేర్ చేశారు. కడప టీడీపీ ఎంపీ టికెట్ ని శ్రీనివాసులురెడ్డికి ఇచ్చారు. ఇక పుంగనూరుకు చల్లా బాబుని, పీలేరు టికెట్ ని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కేటాయించారు. ఇలా మరిన్ని టికెట్లను కూడా చంద్రబాబు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
దీని వల్ల బాబు ఆశిస్తున్నది ఒక్కటే. అక్కడ ముందుగానే జనాల్లోకి నేతలు వెళ్తే వారు బాగా దగ్గర అవుతారని, ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగు అవుతాయని. అయితే ఈ జోరులో బాబు పొత్తుల విషయం మరచిపోతున్నారా అన్న చర్చ వస్తోంది. ఏపీలో టీడీపీ పొత్తులతోనే వెళ్తుంది అని అంతా అంటున్నారు.
కానీ చంద్రబాబు దూకుడు చూస్తే ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటున్నారా అన్న చర్చ వస్తోంది. ఇక జనసేన విషయం తీసుకుంటే పొత్తులకు ఇష్టమే అన్నట్లుగా తెలుస్తున్నా ఆ ప్రతిపాదన టీడీపీ నుంచి వస్తేనే బేరసారాలకు తమది పై చేయిగా ఉంటుందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే వ్యూహాలలో చాణక్య నీతిలో పది ఆకులు ఎక్కువ చదివిన చంద్రబాబు తామే ముందుగా ప్రతిపాదన చేస్తే జనసేన గొంతెమ్మ కోరికలు కోరుతుంది అని అంచనా కడుతున్నారు అని అంటున్నారు.
అందుకే తమ వైపు నుంచి ఏ రకమైన ప్రతిపాదన లేకుండా ఇలా టికెట్ల పంపిణీ చేస్తూ ఒక విధంగా వత్తిడి పెడుతున్నారు అని అంటున్నారు. రానున్న రోజుల్లో కోస్తా, గోదావారి జిల్లాల టూర్లకు చంద్రబాబు చేపట్టనున్నారు. అక్కడ కూడా ఆయన కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాలలో టికెట్లను ముందే ప్రకటించనున్నారని తెలుస్తోంది.
ఈ విధంగా చేయడం వల్ల తమతో జట్టు కట్టాలని కోరుకునే జనసేన కానీ బీజేపీ కానీ అలెర్ట్ కాక తప్పదన్న వ్యూహమే టీడీపీది అంటున్నారు. ఒక విధంగా బాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలుస్తోంది. టికెట్ల పంపిణీతో బుకింగ్ కౌంటర్ ని ఓపెన్ చేసిన చంద్రబాబు పొత్తులైనా ఓకే లేకపోయినా ఓకే అన్న రూట్ ని ఎంచుకున్నారని చెబుతున్నారు. రాయలసీమ వరకూ చూస్తే టీడీపీయే అక్కడ అన్ని సీట్లకు పోటీ చేస్తుందని, పొత్తులకు నో చాన్స్ అని బాబు చెప్పకనే చెబుతున్నారు. రేపటి రోజున గోదావరి, కోస్తా జిల్లాలలో కనుక బాబు టికెట్లు ప్రకటిస్తే మాత్రం జనసేన జాగ్రత్తపడాల్సిందే అంటున్నారు.