Begin typing your search above and press return to search.
మోడీని వీడలేను : బాబు మద్దతు ద్రౌపది ముర్ముకే..
By: Tupaki Desk | 11 July 2022 11:23 AM GMTఎట్టకేలకు చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించి భారీ సస్పెన్స్ తెర దించారు. నిజానికి టీడీపీకి ప్రెసిడెంట్ ఎలక్ట్రోల్ కాలేజీలో అతి తక్కువ సంఖ్యా బలం ఉంది. టీడీపీ మద్దతు ఇవ్వకపోయినా ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో గెలుస్తారు. అయితే ఎందుకో చంద్రబాబు ఇంతకాలం మౌనం వహించారు. బహుశా ఆయన తనను ఎవరైనా సంప్రదిస్తారని ఆగారా లేక ఈ ఎన్నికల విషయంలో వేరే రకాలైన ఎత్తుగడలతో ముందుకు వెళ్ళాలి అనుకున్నారా అన్నది అర్ధం కాదు.
కానీ చివరికి బాబు బీజేపీకే జై అనేశారు. దానికి మరో కారణం కూడా ఉంది. విపక్షల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కూడా టీడీపీని మద్దతు కోసం సంప్రదించలేదు అన్న ప్రచారం ఉంది. అంటే బాబుని అటు వారి కూడా నమ్మలేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి వెళ్లాలని టీడీపీ ఆలోచన చేస్తోంది.
అయితే బీజేపీ నుంచి సానుకూల స్పందన రావడం లేదు. అయితే ఈ రోజు కాకపోయినా రేపు అయినా ఆ పార్టీ నుంచి పిలుపులు వలపులు ఉంటాయన్న ఆశ అయితే బాబుకు ఉంది. అదే టైమ్ లో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గిరిజన నాయకురాలిని పెట్టారు. ఆమెది మచ్చలేని వ్యక్తిత్వం. మొత్తానికి ఎలా చూసుకున్నా టీడీపీ కాదనలేని పరిస్థితి. దాంతో టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో ఈ మేరకు చర్చించి ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించేశారు చంద్రబాబు.
రానున్న రోజుల్లో బీజేపీతో పొత్తు ఆశలను ఆ విధంగా చంద్రబాబు సజీవంగా ఉంచుకున్నారు అనే చెప్పవచ్చు. మొత్తానికి ఏపీ వరకూ చూస్తే బీజేపీకి అసెంబ్లీలో ఒక్క సీటు లేకపోయినా సొంతంగా ఒక్క ఎంపీ కూడా లేకపోయినా కూడా ఏపీలో ఉన్న అన్ని ఓట్లూ ద్రౌపది ముర్ముకే పడుతున్నాయి. పక్కన ఉన్న కేసీయార్ మోడీ మీద గట్టిగా గర్జిస్తూంటే ఏపీలో మాత్రం జై మోడీ అంటున్నారు. ఇక బాబు గారు అయితే నిను వీడని నీడను మోడీ అని ఈ నిర్ణయంతో చెప్పినట్లు అయిందని సెటైర్లు పడుతున్నాయి.