Begin typing your search above and press return to search.
జగన్ కంటే మరో అడుగు ముందుకేసి మరీ బాబు...?
By: Tupaki Desk | 23 Oct 2022 9:34 AM GMTచంద్రబాబు మార్క్ రాజకీయం చేయడం ఎవరి తరం కాదు. ఆయన తన రాజకీయ అనివార్యతలు అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఎన్ని మెట్లు అయినా కిందకు దిగుతారు. ఎంతకు అయినా తగ్గుతారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం చూస్తే ఇదే కనిపిస్తుంది. ఎన్టీయార్ ని గద్దె దించే టైం లో చంద్రబాబు అందరినీ ఆకట్టుకుని పక్కాగా రూపొందించుకున్న రాజాకీయ వ్యూహంతోనే ఏకంగా సీఎం సీటు పట్టేశారు. నాటి నుంచి చంద్రబాబు అప్రతిహతంగా బాబు ముందుకు సాగుతున్నారు.
ఇక 2004లో ఎన్నికల్లో చూస్తే ఓటమి భారీగానే ఎదురొచ్చింది. ఉమ్మడి ఏపీలో కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే బాబు నిరాశ పడకుండా వైఎస్సార్ మీద గట్టిగానే పోరాడారు. దాంతో 2009 ఎన్నికలవేళ గెలుపు దక్కలేదు కానీ రెట్టింపు సీట్లు వచ్చాయి. ఇక విభజన ఏపీలో తన అవసరాన్ని జనాలకు తెలియచేయడంతో పాటు అటు మోడీ చరిష్మాను ఇటు పవన్ సినీ గ్లామర్ ని ఆయన సామాజికవర్గాన్ని కూడా తన వైపుగా తిప్పుకుని మూడవసారి సీఎం అయిపోయారు.
ఇపుడు చూస్తే చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓడి కేవలం 23 సీట్లతో చతికిలపడ్డారు. అయితే బాబు మాత్రం ఓటమిని పట్టించుకోకుండా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఆయన గత మూడున్నరేళ్ళుగా బీజేపీ ప్రాపకం కోసం చేయని ప్రయత్నం లేదు బీజేపీని మోడీని పల్లెత్తు మాట అనడంలేదు సరికదా వారి పుట్టిన రోజులకు పండుగలకు శుభాకాంక్షలు చెబుతూ చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తనకు అతి తక్కువ మంది ఎంపీలు ఉన్నా కూడా మద్దతు ఇవ్వడం ద్వారా తాను బీజేపీ వైపే అని గట్టిగా చెప్పుకున్నారు.
ఇక ఈ మధ్యన ఢిల్లీ వెళ్ళి ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా మోడీతో చేతులు కలిపి ముచ్చట్లు పెట్టారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి అమిత్ షా పుట్టిన రోజు వేళ ఆయనకు నేరుగా ఫోన్ చేసి చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. ఒక విధంగా రాజకీయంగా ఇది సంచలనంగా ఉంది. మోడీ నా జూనియర్ అని చెప్పే చంద్రబాబు అంతకంటే జూనియర్ అయిన అమిత్ షా ప్రాపకం కోసం ఈ రకాంగా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే అమిత్ షాకు ముఖ్యమంత్రి జగన్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఆయన ట్వీట్ తో సరిపెట్టారు. చంద్రబాబు కూడా మొదట ట్వీట్ చేసి ఆ మీదట ఇంకా ముందుకు వెళ్లాలనుకున్నారేమో నేరుగా అమిత్ షా తో ఫోన్ కలిపి గ్రీట్ చేశారు. ఈ విధంగా ఆయన చేయడం ద్వారా బీజేపీ గుడ్ లుక్స్ లో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఇక మీదట ఏపీకి సంబంధించి ఏ విషయాలు మీద అయినా మాట్లాడడానికి వైసీపీ మీద ఫిర్యాదు చేయడానికి దేశ హోం మంత్రితో ఆ విధంగా ఫోన్ కనెక్టివిటీని సంపాదించారు అన్న మాట.
మరి తనకు నేరుగా ఫోన్ చేసి అభినందించిన చంద్రబాబు విషయంలో సాఫ్ట్ కార్నర్ తో కచ్చితంగా అమిత్ షా ఉంటారనే అంటున్నారు. బాబుకు కావలసిందే ఇది. ఈ రోజుకు కాకపోయినా ఎన్నికల వేలకు ఏపీ బీజేపీ టీడీపీతో పొత్తులు పెట్టుకుంటుంది అన్నదే బాబు దృఢ విశ్వాసం. దాని కోసం ఆయన చేయాల్సింది అంతా చేస్తున్నారు. ఒక విధంగా జగన్ ని మించి బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంతో ముందున్నారు అనే అంటున్నారు. మరి మోడీ షా మదిలో ఏముందో చూడాల్సి ఉంది.