Begin typing your search above and press return to search.
జగన్ మీద టీడీపీ సినిమా...జనాలకు చూపిస్తారుట...?
By: Tupaki Desk | 23 Oct 2022 12:40 PM GMTతెలుగుదేశం, పార్టీ పుట్టుక ఒక సినీ నటుడు వల్ల జరిగింది. అందుకే ఎంత కాదనుకున్నా ఆ పార్టీకి ఆ లక్షణాలు బాగానే వంటబట్టాయనుకోవాలి. ఎవరైనా ఏ ప్రభుత్వం మీద అయినా మాములుగా విమర్శలు చేస్తారు. వాటిని మీడియాలో ప్రచురిస్తారు. వాటిని జనాలు చదివో లేక ఆ సంఘటనలను టీవీలలో చూసో మెదడులో నిక్షితం చేసుకుంటారు. ఆలా అయిదేళ్ల పాలన మీద జనాలు తీర్పు ఇచ్చేటపుడు మెదడులో భద్రపరచిన వాటిని బయటకు తీసి మంచీ చేడూ బేరీజు వేసుకుని మరీ ఆ ప్రభుత్వానికి ఓటు ద్వారా మార్కులు వేస్తారు. బాగుంటే పాస్ చేస్తారు, లేకపోతే ఫెయిల్ చేస్తారు.
ఈ దేశంలో ఏడున్నర దశాబ్దాలుగా ఇదే తంతు సాగుతోంది. చదువు లేకపోయినా కూడా సాదర జనం ప్రభుత్వం మంచి చెడ్డలను బహు చక్కగా కనిపెడుతూ తీర్పులు ఇవ్వడం ప్రపంచంలోనే ఒక్క భారత్ కే చెల్లింది. అలాంటి భారత్ లో గత కొన్ని ఎన్నికలను చూస్తే తాయిలాలకు లొంగో లేక ఇతరత్రా ఆకర్షణలతో జ్ఞాపకశక్తి తగ్గి పాతవాటిని మరచిపోయి అక్కడక్కడ తీర్పులు కూడా సవ్యంగా ఇవ్వడంలేదు అని ఓడిన నాయకులు అనుకుంటున్నారు. కానీ ఈ దేశంలో ప్రజా తీర్పులు ఎపుడు సవ్యంగా ఉన్నాయని ఈ రోజుకీ అంతా అంగీకరిస్తారు.
అయితే టీడీపీ మాత్రం అలా అనుకోవడం లేదు. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్నో అఘాయిత్యాలు జగన్ సర్కార్ లో జరిగినా కూడా వాటిని విస్మరించి తీర్పు అనుకూలంగా ఇచ్చే ప్రమాదం ఉందని భావిస్తూ అయిదేళ్ల పాటు జగన్ ఏలుబడిలో చేసిన ప్రజా వ్యతిరేక పనులన్నింటినీ గుది గుచ్చి తక్కువ నిడివి కలిగిన వీడియోలను తయారు చేయిస్తోంది అని అంటున్నారు. జగన్ సీఎం అయ్యాక డే వన్ నుంచి మొదలెట్టి ఆయన పాలన చివరి రోజు దాకా ఏం చేశారు అన్నది కళ్ళకు కట్టినట్లుగా చెబూతూ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయనగానే సోషల్ మీడియాలో వదులుతుంది అని అంటున్నారు.
దీని వల్ల ప్రజలు ఒకవేళ తాము ఈ అయిదేళ్ళ కాలంలో వివిధ కారణాల వల్ల కొన్ని అంశాలను సీరియస్ గా తీసుకోకుండా వదిలేసినా కూడా వాటిని మళ్ళీ వారి మెదళ్లకు ఎక్కించడం ద్వారా ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉండేలా ఈ విధంగా వ్యూహ రచన చేస్తోంది అంటున్నారు. ఈ మొత్తం షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి అలాగే వీడియోలు తీయడానికి కీలక బాధ్యతను అంతా ఐటీడీపీ వింగ్ కే అప్పగించారు అని అంటున్నారు.
ఈ విధంగా షార్ట్ ఫిలిమ్స్ వీడియోలలో ఏముంటాయి అంటే జగన్ సీఎం అయ్యాక ప్రజా వేదికను కూల్చివేత నుంచి మొదలుపెడిత అమరావతి రాజధాని, పోలవరం తో పాటు రైతుల మీద ప్రభుత్వ వేధింపులు, దాడులు, అలాగే అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు జరిగిన వేధింపులు ఆయన మీడియా ఎదుట కంట తడిపెట్టిన వైనం, ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై దాడి చెసిన వైనం. అలాగే విశాఖలో దసపల్లా భూముల వ్యవహారం వంటివి ఉంటాయట. అదే విధంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోలతొ పాటు అనేకమైన ప్రజా వ్యతిరేక విషయాలను పొందుపరచి జనం ముందు పరుస్తారు అని అంటున్నారు.
జరిగినవాటిని ప్రజలకు గుర్తుచేయడంద్వారా ఎన్నికల ముందు జనం అంతా ఒక్కసారిగా ప్రభుత్వం మీద పీకబండెడు కోపంతో ఓటు అనే ఆయుధంతో తిరగబడేలా చేస్తే తమ పంట పండుతుందని టీడీపీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇప్పటికే ప్రజా స్వామ్య పరిరక్షణ పేరిట జనసేనను తన వైపునకు తిప్పుకున్న టీడీపీ మరికొన్ని పార్టీలను కూడా ఈ వైపుగా లాగుతోంది.
ఎన్నికల వేళకు జనంలోకి చంద్రబాబు లోకేష్ ఎటూ వస్తారు. అనుకూల మీడియా నిత్యం ఎటూ వైసీపీ యాంటీ కధనాలు చూపిస్తూనే ఉంటుంది. దానికి తోడు ఈ జగన్ అయిదేళ్ళ పాలన మీద తీస్తున్న ఈ సినిమా అయితే జనాలను మొత్తానికి మొత్తం తమ వైపునకు టర్న్ అయ్యేలా చేస్తుంది అని బలంగా నమ్ముతోంది. సో. ఇది సూపర్ హిట్ ప్లాన్, సక్సెస్ అయితే టీడీపీ గద్దెనెక్కినట్లే అంటున్నారు.