Begin typing your search above and press return to search.

బాబు చేతిలో ఈనాడు సర్వే రిపోర్టు... అందులో ఏముంది... ?

By:  Tupaki Desk   |   13 Nov 2022 3:50 AM GMT
బాబు చేతిలో ఈనాడు సర్వే రిపోర్టు... అందులో ఏముంది... ?
X
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ చాణక్యుడు అని చెబుతారు. అయితే సోషల్ మీడియా కాలంలో జనాలు కూడా ఆరితేరిపోయారు. ఎర్లీ సెవెంటీస్ పాలిటిక్స్ ఈ రోజుల్లో చేస్తే అసలు కుదరడంలేదు. ప్రతీ వారూ స్మార్ట్ ఫోన్లతో తమదైన ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో నుంచి అందరినీ చూస్తున్నారు. అందులో నుంచి కొత్త ఆలోచనలు చేస్తున్నారు.

దాంతో అన్ని విధాలుగా తలపండిన చంద్రబాబుకే రాజకీయం ఏంటో చాలా సార్లు అంతు పట్టడంలేదు. అలా తెలియకనే తికమకపడి ఆయన 2019 ఎన్నికల్లో ఓడారు. ఇపుడు 2024 ఎన్నికల్లో కనుక ఓడితే పార్టీ ఏమవుతుందో ఆయన కంటే బహుశా ఎక్కువగా తెలిసిన వారు ఎవరూ ఉండరు. ఇదిలా ఉంటే రామోజీరావు మీడియా మొఘల్ గా ఉన్నారు. ఆయన టీడీపీకి గట్టి మద్దతుదారు అని ప్రచారంలో ఉన్న మాట.

అవసరం అయినపుడు శ్రీక్రిష్ణ భగవానుడిగా ఆయన తన అండ అందిస్తూ పసుపు పార్టీని పైకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు అని సెబుతారు. ఇపుడు కూడా అలాంటి మహోపకారమే తెలుగుదేశానికి చేసారు అని అంటున్నారు. లేటెస్ట్ గా చంద్రబాబు రామోజీరావు వద్దకు వెళ్ళి దాదాపుగా నాలుగు గంటల పాటు సుదీర్ఘమైన భేటీని వేశారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.

అది నిజమే అని కూడా అంటున్నారు. ఇక రామోజీరావు తో భేటీ సందర్భంగా ఏపీ రాజకీయ విషయాలతో పాటు అనేక అంశాలు చర్చకు వచ్చాయని అంటున్నారు. ఇక ఈ భేటీలో భాగంగా రామోజీరావు తన మీడియా సంస్థ ఈనాడు చేసిన ప్రత్యేకమైన ఒక సర్వే నివెదికను చంద్రబాబుకు అందచేశారని అంటున్నారు.

ఆ సర్వే నివేదిక ప్రకారం ఏపీలో మొత్తం అన్ని జిల్లాల్లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్లుగా చెప్పారని అంటున్నారు. ఈనాడుకు ఏపీవ్యాప్తంగా అతి పెద్ద నెట్ వర్క్ ఉంది. గ్రౌండ్ లెవెల్ లో రియాల్టీస్ ఆ మీడియాకు తెలిసినంతగా ఎవరికీ తెలియవు. అందువల్ల ఈనాడు ఇచ్చిన సర్వే నివేదిక నిక్కచ్చిగా ఉండడమే కాదు తెలుగుదేశానికి బాగా ఉపయోగపడుతుంది అని కూడా అంటున్నారు.

మరో వైపు చూస్తే 2024 ఎన్నికల్లో చంద్రబాబు తనదైన వ్యూహాలను రచించడానికి అలాగే సొంత పార్టీ బలాబలాలు, ప్రత్యర్ధుల గుట్టు అన్నీ కూడా తెలుసుకుని కొత్త ఎత్తులు వేసేందుకు వీలు కలుగుతుంది అని అంటున్నారు. ఇక చూస్తే రానున్న రోజుల్లో చంద్రబాబు జిల్లాల వారీగా టూర్లకు ప్లాన్ చేస్తున్నారు.

అలాగే రివ్యూస్ చేస్తూ ఎక్కడికక్కడ అభ్యర్ధుల ఎంపిక విషయంలో కూడా ఒక నిర్ణయానికి రానున్నారు. మరో వైపు ఆయన కుమారుడు నారా లోకేష్ 2023 జనవరి 27 నుంచి పాదయాత్రను మొదలెట్టనున్నారు. ఈ నేపధ్యంలో అద్భుత వరంగా ఈ సర్వేను రామోజీరావు ఇచ్చారని అంటున్నారు.

ముందుగా అభ్యర్ధులను ఖరారు చేసుకుని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం కావడానికి ప్రత్యర్ధి వైసీపీని చిత్తు చేయడానికి ఈ సర్వే బ్రహ్మాస్త్రంగా చంద్రబాబుకు పనికొస్తుంది అని అంటున్నారు. సో బాబు విజయానికి శ్రీక్రిష్ణుడి మాదిరిగా రామోజీరావు చేయాల్సిన మహోపకారం ముందే చేసారని అంటున్నారు. మరి ఫలితం జనాలు చెబుతారు అంతే.