Begin typing your search above and press return to search.
జగన్ బొమ్మ వెనక బొరుసు ఏంటో చూపిస్తున్న చంద్రబాబు?
By: Tupaki Desk | 20 Nov 2022 11:30 PM GMTనాణేనికి ఒక వైపే చూడకూడదు, చూస్తే విలువ తెలియదు. పైగా దానికి అందం, అర్ధం ఉండదు, రెండూ చూసి బేరీజు వేయాలి. రాజకీయాలలో అయితే బొమ్మను చూపించి బొమ్మాట ఆడతారు. బొరుసులు బిమికలు అక్కడ చూపించరు. అంతా ఒకే అన్నట్లుగా అధికారంలో ఉన్న వారు మెస్మరైజ్ చేస్తారు.
బొమ్మని చూపించి అమ్మో అనిపించి ఓట్లు లాగేయాలనుకునే అధికార పార్టీ పాలిటిక్స్ కి కొత్త ట్రిక్స్ ప్లే చేయాలంటే అది విపక్షం మాత్రమే చేయాలి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం ఆ దిశగా యాక్షన్ లో ఉందా అంటే ఇప్పటిదాకా లేదు అనే జవాబు వస్తుంది. ఎందుకంటే మూడున్నరేళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఎంతసేపూ జగన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూనే పోయింది.
జగన్ సర్కార్ తమ మీద కేసులు పెడుతోందని, తమ కార్యకర్తలను అరెస్ట్ చేస్తోందని, తమ పార్టీని లేకుండా చేస్తోందని ఇలా అంతా టీడీపీ యాంగిల్ లోనే చెబుతూ వస్తోంది. ఇది పార్టీ జనాలకు ఎమోషన్ ఇచ్చే మ్యాటర్ అవుతుందేమో కానీ సదరు జనాలకు ఏమీ సంబంధం లేని వ్యవహారం. అసలు పట్టదు కూడా.
పైగా రాజకీయాల్లో ఇలాంటివి సహజం. వారూ వీరూ చూసుకుంటారు, కత్తులు దూసుకుంటారు మాకేంటి అన్నట్లుగానే ఉంటారు. అందుకే మూడున్నరేళ్లుగా టీడీపీ ఎంతలా గొంతెత్తినా జనాలకు కనెక్ట్ కాలేకపోయింది. ఇపుడు ఆ పార్టీకి వ్యూహకర్తగా రాబిన్ శర్మ వచ్చారు. ఆయన ఇపుడు వైసీపీ బొమ్మకు వెనక ఉన్న బొరుసు ఏంటో చూపిస్తున్నారు.
ఏపీలో ఫీల్ గుడ్ భావనతో వైసీపీ జనంలో మైండ్ గేం ఆడుతోందని ఆ డొల్లతనాన్ని బయటపెట్టి బొమ్మ వెనక బొరుసు ఇదీ అని చెబితే కచ్చితంగా జనాలు మారుతారు అని రాబిన్ శర్మ టీడీపీకి ఒక బహు చక్కని వ్యూహాన్ని అందించారు. ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి అంటూ ఆయన ఇచ్చిన స్లోగన్ కూడా అదే. ఇక ఏపీలో ఏకంగా యాభై లక్షల కుటుంబాలు, రెండు నెలల పాటు జనంలో టీడీపీ తమ్ముళ్ళు ఉండాలి.
వారంతా ప్రతీ ఇంటికీ టచ్ చేయాలి. ఏపీ సర్కార్ ఇస్తున్న పధకం ఏంటి, దాని వెనక ఖర్చు ఏంటి, ఏపీలో ఏం జరుగుతోంది, అభివృద్ధి ఏమైనా ఉందా, ప్రజలకు నిజంగా ఎంత అందుతోంది, ఎంత అందాలి. ఏపీ అప్పులమయంగా కాకపోతే ఇలాంటి పధకాలు ఇంకెన్ని జనాలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ ఇపుడు తమ్ముళ్ళు ఇంటింటికీ వెళ్ళి వివరిస్తారు. అదే విధంగా ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్లు బాగులేవు, పరిశ్రమలు లేవు, ఇవన్నీ మాకు కావు అనుకుంటే ఏపీ ఏమవుతుంది.
ఇదే వైసీపీ మళ్ళీ పవర్ లోకి వస్తే ఏమి జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు సవివరంగా తెలియచేయడం ద్వారా వారి మనసును మార్చడమే కాకుండా సర్కార్ మీద పూర్తి వ్యతిరేకతను గ్రౌండ్ లెవెల్ నుంచి పెంచుకుని రావడమే ఇదేమి ఖర్మ ప్రోగ్రాం ఉద్దేశ్యం. ఒక్క రెండు నెలలు మొత్తం టీడీపీ అంతా ఏపీ ముంగిట ఉంటే చాలు ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ఇక జనమే చూసుకుంటారు. ఇదీ బొమ్మ వెనక బొరుసు కధ.
మరి సంక్షేమం మాకు బాగుంది. పధకాలను జగన్ ఇస్తున్నారు. మాకేంటి అని అనుకునే ప్రజానీకం మారుతారా. ఏపీలో టీడీపీ వస్తే ఏమి తమకు మేలు జరుగుతుందని భావించి ఆ వైపుగా టర్న్ అవుతారా, వైసీపీ బొమ్మ వెనక కనికట్టు ఏంటో తమ్మ్ముళ్ళు విడమరచి చెప్పగలరా.
ఇవన్నీ రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఇపుడు అసలైన రాజకీయం మొదలైంది అనుకోవాలి. వైసీపీ వారి గడప గడపకు టీడీపీ ఇదేమి ఖర్మ అంటూ ప్రతీ ఇంటికీ వెళ్ళి కౌంటర్ అటాక్ చేయబోతోంది. సో హీటిక్కించే పాలిటిక్స్ ని ఏపీ జనాలు చూడబోతున్నారు.