Begin typing your search above and press return to search.
ఆ ఎస్పీని తప్పిస్తేనే పల్నాడు ప్రశాంతం: చంద్రబాబు
By: Tupaki Desk | 18 Dec 2022 2:45 PM GMTతాజాగా పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘటనలు.. టీడీపీ నేతల అరెస్టు, పార్టీ నాయకుల వాహనాల దహనం.. గృహాల విధ్వంసం వంటివాటిపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. దీనికి కారణం పల్నాడు జిల్లా ఎస్పీనేనని ధ్వజమెత్తారు. పల్నాడు ఎస్పీ తీరు దారుణంగా ఉందని చంద్రబాబు విమర్శించారు. ఎస్పీ స్థానంలో హోంగార్డును పెట్టినా సమర్థంగా విధులు నిర్వహించేవారని అన్నారు.
పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తీరు అత్యంత హేయంగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. మాచర్లలో వైసీపీ అరాచక క్తులకు ఎస్పీ సహకరిస్తున్నారని ఆరోపించారు. అరాచక శక్తులకు అండగా ఉన్న ఎస్పీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పల్నాడు ఎస్పీ స్థానంలో ఆయన పనిచేసే కార్యాలయంలోని హోంగార్డును కూర్చోబెట్టినా సమర్థంగా పని చేస్తారని ఎద్దేవా చేశారు. ఇలాంటి అధికారులతో పోలీసు విభాగానికే తలవంపులని ఆవేదన వ్యక్తం చేశారు.
లా అండ్ ఆర్డర్ ను పణంగా పెట్టి...మాచరల్లో వైసిపి అరాచక శక్తులకు సహకరిస్తున్న ఎస్పీ ని వెంటనే తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ.. ఎస్పీ.. శాంతి భద్రతలను మంటగలుపుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రతి విషయంలోనూ టీడీపీ నేతలపై కేసులు పెడుతూ.. అధికార పార్టీ నేతల మెప్పుకోసం ఆయన ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు. కాగా, గత రెండు రోజుల పాటు.. మాచర్లలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య తీవ్ర యుద్ధం సాగిన విషయం తెలిసిందే.