Begin typing your search above and press return to search.
చంద్రబాబు స్వెటర్ వేసుకోవడం ఎప్పుడైనా చూశారా
By: Tupaki Desk | 1 Jan 2023 10:56 AM GMTరాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిల్లీ చేరి ఆయన ఎర్రకోట వద్ద ప్రసంగించి మొదలు కొద్దిరోజులుగా మీడియాలో ఒకటే కథనాలు.. ‘రాహుల్ గాంధీకి చలి వేయదా?’ అంటూ డిస్కషన్లు. దిల్లీలోనే పుట్టి పెరిగిన, శీతల దేశాలలోనూ చదువుకున్న 50 ఏళ్ల రాహుల్ గాంధీ చలిని తట్టుకోవడం పెద్ద విషయం కాదు.. కానీ, భూమధ్య రేఖకు 12 డిగ్రీల దూరంలో ఉన్న చిత్తూరు జిల్లాలో జన్మించి.. ఉష్ణమండలమైన రాయలసీమలోనే పెరిగిన చంద్రబాబు తన ప్రాంతం కాని చలిప్రాంతం దిల్లీలో కూడా కేవలం చొక్కాతో తిరగడం గొప్ప విషయం.
50 ఏళ్ల రాహుల్ గాంధీ కేవలం టీషర్ట్ మాత్రమే వేసుకుని చలిలో తిరగగలగుతున్నారని ప్రచారం కావడానికి కేవలం వారం రోజుల ముందు 72 ఏళ్ల చంద్రబాబు దిల్లీ వెళ్లారు. ఆ సందర్భంలో ఆయన ఎప్పటిలాగే గోధుమ రంగు చొక్కా, గోధుమ రంగు ప్యాంట్‌తోనే తిరిగారు. అప్పటికే దిల్లీలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గిపోయాయి. డిసెంబరు నెలలో దిల్లీలో చలి తీవ్రంగా ఉంటుంది. దిల్లీలో చంద్రబాబు కలిసిన, చంద్రబాబును కలిసిన నేతలు మోదీ, అమిత్ షా, కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వంటివారంతా స్వెట్టర్లు, శాలువాలు, మఫ్లర్లతో కనిపించారు కానీ చంద్రబాబు మాత్రం తన సాధారణ దుస్తులలోనే కనిపించారు.
సరే.. రాహుల్ గాంధీయే కాదు చంద్రబాబు కూడా స్వెటర్ వేసుకోలేదు అనుకుందాం. మరి.. రాహుల్ గాంధీ చంద్రబాబులా ఎప్పుడూ స్వెటర్ వేసుకోరా..? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం కాదనే చెప్పాలి. రాహుల్ గాంధీ దిల్లీలో ఉన్నప్పుడు స్వెటర్, జాకెట్లలో కనిపిస్తుంటారు. అంతెందుకు... 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరి నెల ప్రారంభంలో.. ఏపీకి జరుగుతన్న అన్యాయం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై దిల్లీలో నిరసన తెలపడానికి వెళ్లిన చంద్రబాబును జాతీయ నాయకులు ఎందరో కలిశారు. అప్పుడు రాహుల్ గాంధీ కూడా చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపారు. ఫిబ్రవరి నెలలో కూడా దిల్లీలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుంది. ఆ సమయంలో నిరసన తెలిపేందుకు చంద్రబాబు నల్ల చొక్కాలో కనిపించారు. స్వెటర్ కానీ, జాకెట్ కానీ, మఫ్లర్ కానీ, శాలువా కానీ ఏమీ వేసుకోలేదు. కానీ... ఆయన్ను కలిసిన రాహుల్ గాంధీ మాత్రం ఎలాంటి చలినైనా ఆపగలిగే మంచి దిట్టమైన నల్లటి జాకెట్‌లో కనిపించారు.
ఇవన్నీ చూశాక ఏం మాట్లాడుకోవాలి... ? చలిని ఏమాత్రం లెక్క చేయనది చంద్రబాబా? రాహుల్ గాంధీయా?
ఇంకో రహస్యం... ఉత్తరాదిలోని చలి ప్రాంతాల్లో.. మరీ ముఖ్యంగా దిల్లీలో నివసించేవారు.. అక్కడే పుట్టి పెరిగినవారు.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ థర్మల్స్ వాడుతారు. అంటే... తీవ్రమైన చలిని కూడా ఆపే లోదుస్తులు. శరీరాన్ని అతుక్కునేలా ఉండే ప్యాంట్లు, కాలర్ లేని హాఫ్/ఫుల్ హ్యాండ్ టీషర్టుల రూపంలో ఈ థర్మల్స్ దొరుకుతాయి. ఇవి వేసుకున్నాక.. వీటిపైన సాధారణ ప్యాంటు, చొక్కాలు, టీ షర్టులు వేసుకుంటుంటారు. అప్పడు సాధారణ దుస్తులు వేసుకున్నట్లుగానే కనిపిస్తుంది కానీ చలి వేయదు. రాహుల్ గాంధీ ఇందుకు మినహాయింపేమీ కాదు.